Realme Narzo Turbo 70: రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీపై భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ.. వివరాలు ఇలా..
15 నుంచి 16 వేల రూపాయల బడ్జెట్‌లో మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్ డీల్‌లో బంపర్ డిస్కౌంట్‌తో పొందవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,998గా ఉండగా,15% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో మీరు రూ.2500 కూపన్ డిస్కౌంట్ కూడా పొందగలరు. కంపెనీ ఈ ఫోన్‌పై రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. పైగా,ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్ మార్పిడి చేసి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మొత్తం మీ పాత ఫోన్ పరిస్థితి,బ్రాండ్,కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
ఫీచర్ల విషయానికొస్తే, రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం విశేషం. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌తో పాటు 2000 నిట్స్ వరకూ బ్రైట్‌నెస్ లెవల్ అందించగల సామర్థ్యం దీని ప్రత్యేకత. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం పాండా గ్లాస్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.
45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ ఏఐ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా అందించబడింది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడింది, ఇది 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5 ఉంటుందని కంపెనీ పేర్కొంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.