
Russia: రష్యా భూభాగం వైపు దూసుకొచ్చిన ఓ చిన్న గ్రహశకలం.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
భూమి వైపు దూసుకొచ్చిన చిన్న గ్రహశకలం (Asteroid) రష్యా భూభాగాన్ని తాకింది.
అయితే, వాతావరణంలోనే అది మండిపోవడంతో ఆకాశంలో మెరుపుల జాడలు కనిపించాయి.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ గ్రహశకలం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగి ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ముందుగానే గుర్తించింది.
ఇది ప్రమాదకరమైనదిగా పరిగణించాల్సిన అవసరం లేదని ఎజెన్సీ స్పష్టంచేసింది.
మంగళవారం సాయంత్రం ఈశాన్య రష్యాలోని మారుమూల ప్రాంతం వైపు ఈ గ్రహశకలం దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
వివరాలు
గ్రహశకలాన్ని గుర్తించిన ఆరిజోనా విశ్వవిద్యాలయం
వాతావరణంలోనే పూర్తిగా మండిపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.
ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా చూసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.
అదే సమయంలో, నాసా (NASA) ఈ ఘటనను హాని చేయని అగ్నిగోళంగా అభివర్ణించింది.
ఈ గ్రహశకలాన్ని తొలుత ఆరిజోనా విశ్వవిద్యాలయం గుర్తించినట్లు వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
Video of the 70cm asteroid that entered earths atmosphere over northern Siberia today ☄️ pic.twitter.com/kXdEULUe5X
— Volcaholic 🌋 (@volcaholic1) December 3, 2024