Page Loader
Sam Altman: యూజర్లు చాట్‌జీపీటీకి ఇచ్చే మర్యాదకు పెద్ద మొత్తం ఖర్చు.. ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
యూజర్లు చాట్‌జీపీటీకి ఇచ్చే మర్యాదకు పెద్ద మొత్తం ఖర్చు.. ఓపెన్‌ఏఐ సీఈఓ

Sam Altman: యూజర్లు చాట్‌జీపీటీకి ఇచ్చే మర్యాదకు పెద్ద మొత్తం ఖర్చు.. ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు లక్షలాదిమంది ఈ సేవలను వినియోగిస్తున్నారు. దీనితో పాటు ఓపెన్‌ఏఐ సంస్థ కూడా నూతన మోడళ్లతో, ఆధునిక ఫీచర్లతో ఈ సేవను మరింత అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ఈ చాట్‌బాట్‌ విషయంపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ (Sam Altman) ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒక్కో ఏఐ సేవను 24 గంటల పాటు కొనసాగించేందుకు కోట్లలో ఖర్చు అవుతోందని ఇప్పటికే చెప్పిన ఆయన... ఇప్పుడు మరొక విషయం కూడా చెప్పారు. యూజర్లకు మర్యాదగా సేవలు అందించడంలో కూడా పెద్ద మొత్తంలో వ్యయం జరుగుతుందన్నారు.

వివరాలు 

 'థాంక్యూ', 'ప్లీజ్‌'.. పదాల వల్ల అదనపు లోడ్‌

చాట్‌జీపీటీతో మాట్లాడేటప్పుడు 'థాంక్యూ', 'ప్లీజ్‌' వంటి మర్యాదపూర్వక పదాలు చాలామంది వాడుతుంటారు. అయితే, ఈ పదాలకు ప్రతిస్పందన ఇవ్వడానికి సిస్టమ్‌ మీద అదనపు లోడ్‌ ఏర్పడుతుందని, దాంతో పెద్దఎత్తున ఖర్చు అవుతోందని శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. ''థాంక్యూ, ప్లీజ్‌ లాంటి పదాలకు సమాధానం చెప్పడానికే మేము మిలియన్‌ డాలర్ల వ్యయం చేస్తున్నాం'' అని చెప్పారు. ఓ యూజర్‌ 'ఎక్స్‌' (X) సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఆల్ట్‌మన్‌ స్పందిస్తూ, "యూజర్లు మర్యాదగా వ్యవహరించేందుకు ప్రోత్సాహంగా మేము దాదాపు పది మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాం" అని వెల్లడించారు. ఆయన ఈ వ్యాఖ్య నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది.