Samsung Galaxy S25: జనవరి 22న శాంసంగ్ గాలక్సీ ఆన్ ప్యాకెడ్ ఈవెంట్ 2025.. గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 తేదీలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఈవెంట్ జనవరి 22వ తేదీన యుఎస్‌ఏలోని శాన్ జోస్‌లో జరుగుతుంది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.
శాంసంగ్ ప్రియులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి https://www.samsung.com/in/, Samsung Newsroom,Samsung అధికారిక YouTube ఛానెల్‌లను ఉపయోగించవచ్చు.
ఈ కార్యక్రమంలో శాంసంగ్ తన గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను లాంచ్ చేయనుంది.
వివరాలు
గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో మూడు మోడల్స్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ప్రతీ ఏడాది జనవరిలో తన ప్రీమియం గెలాక్సీ ఎస్ సిరీస్‌ను విడుదల చేయడానికి ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తుంది.
ఈ సిరీస్‌కు సంబంధించిన కొత్త మోడల్స్, ఫీచర్లు తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
గెలాక్సీ ఎస్ సిరీస్ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ లేటెస్ట్ సిరీస్‌కు ప్రత్యక్ష పోటిగా ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.
గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో మూడు మోడల్స్ వస్తాయి: గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్, గెలాక్సీ ఎస్25 అల్ట్రా.
ఈ ఫోన్లు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం.
వివరాలు
గెలాక్సీ ఎస్25 సిరీస్ ప్రారంభ వేరియంట్ ధర ₹1,35,000
శాంసంగ్ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-రిజర్వేషన్‌ను ప్రారంభించింది. కస్టమర్లు శాంసంగ్ ఇండియా స్టోర్‌కి వెళ్లి ₹1,999 టోకెన్ అమౌంట్ చెల్లించి వీఐపీ పాస్‌ను పొందవచ్చు.
ఈ టోకెన్ ద్వారా, ఫోన్ కొనుగోలులో రూ.5,000 ఈ-స్టోర్ వోచర్ రూపంలో ప్రయోజనాలు పొందవచ్చు.
అంతేకాకుండా, టోకెన్ అమౌంట్ చెల్లించిన వారికి ₹50,000 విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.
ధర విషయానికి వస్తే, గెలాక్సీ ఎస్25 సిరీస్ ప్రారంభ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర సుమారు ₹1,35,000 ఉంటుందని అంచనా.
అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోవడంతో, త్వరలో ధరపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.