శాంసంగ్ టాబ్లెట్ 9 సిరిస్ లో మూడు మోడల్స్‌ను సంస్థ లాంచ్ చేసింది.
అవి ఎస్9, ఎస్9 ప్లస్, ఎస్9 అల్ట్రా.
ఎస్9 11-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. దీని ధర ధర 799 డాలర్లు
ఎస్9 ప్లస్ 12.4-అంగుళాలు ఉంటుంది. దీని ధర 999 డాలర్లు
ఎస్9 అల్ట్రా 14.6-అంగుళాల స్క్రీన్ వస్తోంది. ధర 1999 డాలర్లు
గెలాక్సీ ట్యాబ్ ఎస్9 టాబ్లెట్‌లు అప్‌గ్రేడ్ చేసిన డిస్‌ప్లేలు, స్పీకర్‌లు వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తాయని సంస్థ పేర్కొంది.
గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరిస్ మోడల్స్ నీరు, దుమ్ము-నిరోధకాలను కలిగి ఉంటాయి. ఇది నీటిలో మునిగినా ఏం కాదు.
ఇది IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
శాంసంగ్ టాబ్లెట్ 9 సిరీస్‌ను సంస్థ లాంచ్ చేసింది.
శామ్సంగ్ కొత్త గెలాక్సీ వాచ్6, గెలాక్సీ వాచ్6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేసింది.
గెలాక్సీ వాచ్6 కనిష్ట ధర 299 డాలర్లు
గెలాక్సీ వాచ్6 క్లాసిక్ కనిష్ట ధర 100 డాలర్లు
వీటిని వినియోగదారు ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా అభివృద్ధి చేసినట్లు సంస్థ పేర్కొంది.
ఇది ఇంటరాక్టివ్ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.
గెలాక్సీ వాచ్6 సిరీస్ ఇప్పుడు నిద్ర సమయం, మేల్కొనే సమయం, శారీరక, మానసిక రికవరీ లోతైన విశ్లేషణను అందిస్తుంది.
శాంసంగ్ నూతన గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ను సంస్థ పరిచయం చేసింది. ఇది ECG, హృదయ స్పందన రేటు, నిద్రను ట్రాక్ చేస్తుంది.
శాంసంగ్ కొత్త గెలాక్సీ వాచ్ 6 సిరీస్ ఆగస్టు 11నాటికి మార్లెట్‌లోకి విక్రయానికి అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ధరను సంస్థ ప్రకటించింది. ఈ మోడల్ ప్రారంభ ధరను 999 డాలర్లుగా ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ Fold5 ధరను సంస్థ ప్రకటించింది. ఈ మోడల్ ప్రారంభ ధరను 1,799 డాలర్లుగా ప్రకటించింది.
శాంసంగ్ Fold5 మోడల్‌ను ఫోల్డ్4 మాదిరిగానే రూపొందించారు.
Flip5 లాగే Fold5లో IPX8 రేటింగ్ ఉంటుంది.
'Flex Hinge' మెకానిజంతో దీన్ని తయారు చేశారు.
ఓవర్‌లాక్డ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, ఆకర్షణీయమైన ఇన్నర్ స్క్రీన్ దీని సొంతం. సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇందులో ప్రత్యేకత ఏంటంటే రెండు టాస్క్‌బార్‌లు కాకుండా నాలుగు ఇందులో ఉంటాయి.
ఒక యాప్, మరొక యాప్‌కి కంటెంట్‌ను సులభంగా కాపీ చేయడానికి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ల ఫోల్డ్ 5 మోడల్‌ను తేలికైన ఎస్ పెన్, ఫ్లెక్స్ మోడ్‌లో దీన్ని తయారు చేశారు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ల ఫోల్డ్ 5 మోడల్ ను సంస్థ లాంచ్ చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా నడుస్తుంది.
'శాంసంగ్ గెలాక్సీ Z Flip 5; మోడల్ మొబైల్‌ను సంస్థ లాంచ్ చేసింది.
ఫ్లిప్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ 3.4-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఇందులో ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.
విభిన్న వాల్‌పేపర్‌లతో ఇది ఆకర్షిణీయంగా ఉంటుంది.
ప్రీమియం హ్యాండ్‌సెట్ కొత్త, పెద్ద కవర్ స్క్రీన్ దీని సొంతం.
ఇదీ వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
3.4-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.
60Hz రిఫ్రెష్ రేట్‌తో 720p OLED ప్యానెల్, విడ్జెట్‌లు, శామ్‌సంగ్ వాలెట్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్, నిఫ్టీ కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇది ఫోల్డబుల్ కావడంతో ప్రతి సారి మీరు ఫోన్‌ని తెరవాల్సిన అవసరం లేదు.
ఇందులో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ఉంటుంది.
'శాంసంగ్ గెలాక్సీ Z Flip 5; మోడల్ మొబైల్‌ను సంస్థ లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఫ్లిమ్ మోడల్ మొబైల్‌పై రోహ్ ఆసక్తిక వ్యాఖ్యలు చేసారు. శాంసంగ్ గెలాక్సీ ఫ్లిమ్ మోడల్ ఉంటే, మీ జేబులో మినీ పీసీ ఉన్నట్లే అని స్పష్టం చేశారు.
శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ అన్‌ప్యాక్డ్ 2023 ప్రారంభమైంది. శాంసంగ్ మొబైల్ అధినేత TM రోహ్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మిలియన్ల మంది గెలాక్సీ వినియోగదారులు ఉన్నట్లు రోహ్ చెప్పారు. ఫోల్డబుల్ ఫోన్ మోడల్ 100 మిలియన్ల వినియోగదారులను అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు రోహ్ చెప్పారు
శాంసంగ్ కాసేపట్లో లాంచ్ చేయబోయే మోడల్స్‌లో ఫోల్డ్ బుల్ ఉండే అవకాశం ఉంది. వీటిని చాలా సన్నగా, తేలికగా ఉండేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
గెలాక్సీ జెడ్ ప్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ 6 మోడల్ వాచ్, గెలాక్సీ బడ్స్ 3, ట్రూలీ వైర్ లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్‌లు, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా 5జీ మోడల్స్‌ను సంస్థ విడుదల చేయనుంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' సాయంత్రం 4:30గంటలకు చేయనుంది. 'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023(Samsung Galaxy Unpacked) పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో లాంచ్ కాబోయే శాంసంగ్ నూతన మోడల్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.