
Olo: ఇంతకు ముందు ఎవరూ చూడని 'కొత్త రంగు'ను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్తరకమైన రంగును శాస్త్రవేత్తల బృందం కనుగొన్నట్లు చెబుతున్నారు.
ఈ పరిశోధన కోసం చేసిన ఓ ప్రయోగంలో, అమెరికాలోని శాస్త్రవేత్తలు తమ కన్నుల్లోకి లేజర్ పల్సులను పంపించారు.
ఈ ప్రక్రియ ద్వారా రెటీనాలో ఉన్న ప్రత్యేకమైన కణాలు ఉత్తేజితమయ్యాయి.
ఫలితంగా, ఈ ప్రయోగంలో పాల్గొన్నవారు 'నీలం-ఆకుపచ్చ' కలయికలో కనిపించే ఓ ప్రత్యేకమైన రంగును చూసినట్టు తెలిపారు.
ఈ కొత్త రంగుకు శాస్త్రవేత్తలు 'ఓలో (Olo)' అనే పేరును పెట్టారు.
ఈ అధ్యయనం వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ అనే ప్రముఖ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రెన్ ఎన్జీ ఈ పరిశోధనకు సహ రచయిత. ఆయన ఈ పరిశోధనను "అద్భుతమైన"దిగా పేర్కొన్నారు.
వివరాలు
ప్రయోగంలో ఐదుగురు శాస్త్రవేత్తలు
ఈ రంగు కనుగొనడం కలర్ బ్లైండ్‌నెస్ (రంగులను సరిగా చూడలేకపోవడం) విషయంలో చేపట్టే భవిష్యత్తు పరిశోధనలకు మార్గం చూపుతుందని ప్రొఫెసర్ ఎన్జీతో పాటు అతని సహచర శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రయోగంలో పాల్గొన్న ఐదుగురు శాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ ఎన్జీ కూడా ఒకరు.
బీబీసీ రేడియో 4 టుడే ప్రోగ్రామ్‌లో ఆయన ఈ రంగుకు సంబంధించిన వివరాలను వివరించారు.
ప్రయోగ సమయంలో ప్రతి ఒక్కరి కనుగుడ్డులోకి లేజర్ కాంతిని పంపించి పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న ఐదుగురిలో నలుగురు పురుషులు, ఒకరు మహిళ.
వీరందరికీ సాధారణ కంటిచూపు ఉంది. ప్రొఫెసర్ ఎన్జీతో పాటు మరి మరో ముగ్గురు ఈ పరిశోధనా పత్రానికి సహ రచయితలుగా ఉన్నారు.
వివరాలు
అధ్యయనంలో, 'ఓజెడ్ (OZED)' అనే ప్రత్యేక పరికరం
ఈ అధ్యయనంలో, 'ఓజెడ్ (OZED)' అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు.
ఇది అద్దాలు, లేజర్లు, ఆప్టికల్ పరికరాలతో రూపొందించబడినది. ఇందులో పార్టిసిపెంట్లు చూడటం ద్వారా రంగును అనుభవించారు.
ఈ పరికరాన్ని ముందుగా వాషింగ్టన్ యూనివర్సిటీ, యూసీ బెర్క్లీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేయగా, తాజా అధ్యయన అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు.
రెటీనా అనేది మన కంటిలోని వెనుక భాగంలో ఉండే సున్నితమైన కణజాలపు పొర.
ఇది కాంతిని గ్రహించి, దానిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఆ సిగ్నల్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరి మనం చూడగలగేలా చేస్తాయి.
వివరాలు
సహజంగా చూస్తే ఓలో అనే రంగు కనిపించదు
రెటీనాలో మూడు రకాల కోన్ కణాలు ఉంటాయి.ఎస్ (S), ఎమ్ (M), ఎల్ (L). ఇవి వరుసగా నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగులకు ప్రతిస్పందిస్తాయి.
పరిశోధకుల ప్రకారం, ఎం కోన్ కణాన్ని ప్రేరేపించడానికి ఉపయోగించిన కాంతి దాని పక్కనున్న ఎల్, ఎస్ కణాలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఎందుకంటే ఈ కణాల పనితీరులో పరస్పర సంబంధం ఉంటుంది.ఈ ప్రయోగంలో మాత్రం కేవలం ఎం కోన్ కణాలే ఉత్తేజితమయ్యాయి.
ఇది సహజ కంటిచూపులో జరగనిది. అందుకే,సహజంగా చూస్తే ఓలో అనే రంగు కనిపించదు. ఇ
ది కేవలం ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రేరణతోనే కనిపించగలిగే రంగు అని వారు తెలిపారు.
ప్రతీ ప్రయోగంలో పాల్గొన్నవారు కంట్రోలబుల్ కలర్ డయల్‌ను సర్దుతూ, తమకు కనిపించిన రంగును గుర్తించారు.
వివరాలు
కోన్ కణాల ప్రేరణలో సాంకేతిక ప్రగతి
దీని ద్వారా ఓలో అనే కొత్త రంగును గుర్తించి ధృవీకరించారు. కానీ, ఈ రంగు గురించి ఇంకా విశ్లేషించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఈ రంగు కనుగొనడం కోన్ కణాల ప్రేరణలో సాంకేతిక ప్రగతిగా భావించబడుతున్నప్పటికీ, ఇది కొత్త రంగు అన్న అంశం గురించి ఇంకా పెద్ద చర్చ జరగవలసి ఉందని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సిటీ సెయింట్ జార్జెస్‌కు చెందిన విజన్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ బార్బర్ వ్యాఖ్యానించారు.
ఈ రంగును సాంకేతికంగా చూడటం సాధ్యం కావడం కొత్తదే అయినా, రంగుల మధ్య తేడాలు గుర్తించలేకపోతున్న వారికి ఇది ఎలా సహాయపడుతుందో తన బృందం నిర్ధారించేందుకు కృషి చేస్తోందని ప్రొఫెసర్ ఎన్జీ చెప్పారు.