Page Loader
Spookfish: పసిఫిక్ మహాసముద్రగర్భంలో 'స్పూక్ ఫిష్'ని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు
పసిఫిక్ మహాసముద్రగర్భంలో 'స్పూక్ ఫిష్'ని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

Spookfish: పసిఫిక్ మహాసముద్రగర్భంలో 'స్పూక్ ఫిష్'ని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు మంగళవారం సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే అరుదైన షార్క్‌ చేపను గుర్తించినట్లు ప్రకటించారు. ఇది పసిఫిక్‌ సముద్రంలో మైలుకు పైగా లోతుల్లో తేలింది. ఈ చేపను స్పూక్‌ ఫిష్‌ జాతికి చెందనట్లుగా పేర్కొన్నారు. విల్లింగ్టన్‌లోని 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ అట్మోస్పియరిక్‌ రీసెర్చ్‌' ప్రకారం, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ జలాల్లో ఈ చేప జీవిస్తున్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా న్యూజిలాండ్‌ దక్షిణ భాగంలో ఉన్న 'ది ఛాతమ్‌ రైజ్‌' ప్రాంతంలో ఇది కనుగొనబడింది. ఈ ప్రదేశం సుమారు 1,000 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్‌ చేస్తోంది.

వివరాలు 

ఈ కొత్త చేప జాతి పేరు 'హర్రియోటా అవియా' 

ఈ కొత్త చేప జాతికి 'హర్రియోటా అవియా' అనే పేరు ఇవ్వాలని శాస్త్రవేత్త బ్రిట్‌ ఫినూసీ వెల్లడించారు. సముద్రం అడుగున ఉండే షార్క్‌ జాతి చేపలను సాధారణంగా చిమేరా అని పిలుస్తారు. వీటి ఎముకలు మృదులాస్థితో తయారై ఉంటాయి, ఇది ప్రత్యేకత. నల్లటి కళ్లు ఉన్నందువల్ల వీటిని ఘోస్ట్‌ ఫిష్‌ అని కూడా అంటారు. వీటికి నోరు చిమేరా వంటి ముక్కుతో సముద్రంలో సుమారు 2,600 మీటర్ల లోతున ఆహారం వెతుక్కుంటూ ఉంటాయి.