ShakthiSAT: 'శక్తిశాట్' మిషన్.. అంతరిక్ష సాంకేతికతపై 108 దేశాలకు చెందిన బాలికలకు శిక్షణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కొత్త అడుగు - ఏరోస్పేస్ అంకుర సంస్థ 'స్పేస్ కిడ్జ్ ఇండియా' అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తూ 'శక్తిశాట్' మిషన్‌ను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇస్రో 'చంద్రయాన్-4' మిషన్‌లో ప్రయోగించాల్సిన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు (వయసు 14-18) అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ మిషన్ కింద, విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థలపై ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు.
యూఏఈ, బ్రిటన్, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక వంటి 108 దేశాలు ఇందులో భాగం కానున్నాయి.
Details
అధికార పోస్టర్ ను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి
శిక్షణ అనంతరం, ప్రతి దేశం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి, వారిని శాటిలైట్స్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్‌ల డెవలప్‌మెంట్‌లో నైపుణ్యాలు పెంపొందించనున్నారు.
'చంద్రయాన్-4' మిషన్‌లో భాగంగా ఉపగ్రహాన్ని ప్రయోగించడమే ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ నమూనాను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించనున్నారు.
బాలికల సాధికారతకు ఈ మిషన్ కీలకంగా మారనుంది. వారిని ఆలోచనాపరులుగా, సాంకేతికతలో ప్రావీణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.
హైస్కూల్, కళాశాల విద్యార్థులతో ఉపగ్రహాలను అభివృద్ధి చేసే తొలిసారి సంస్థగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార పోస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు.