తదుపరి వార్తా కథనం

Whatsapp: మరో అద్భుత ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్.. ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ షేరింగ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 23, 2024
04:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అనునిత్యం అద్భుతమైన ఫీచర్లతో వాట్సాప్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.
ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చి వినియోగదారులను అబ్బురపరుస్తోంది.
తాజాగా ఆపిల్ ఎయిర్ డ్రాప్ తరహాలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫైల్స్‌ను షేర్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది.
మొదట ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ఆవిష్కరించిన ఈ ఫీచర్, తాజాగా iOS వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది
details
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్
WABetaInfo ప్రకారం, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లను భాగస్వామ్యం చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్ ఫైల్ -షేరింగ్ రానుంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS కోసం బీటా టెస్టింగ్ దశలో ఉంది.
ఈ ఫీచర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ ఫీచర్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో వస్తుందో వేచిచూడాలి