Page Loader
ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5
PS5 గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ బండిల్‌కు కూడా తగ్గింపు వర్తిస్తుంది

ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 28, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

సోనీ భారతదేశంలో తన ప్లేస్టేషన్ 5 (PS5) ఏప్రిల్ 1 నుండి రూ.5,000 తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంటే PS5 (డిజిటల్ ఎడిషన్) రూ. రూ. 39,990కు (రూ. 44,990 నుండి), సాధారణ PS5 ధర రూ. 49,990కు (రూ. 54,990 నుండి) లభిస్తాయి. ఈ తగ్గింపు సోనీ సమ్మర్ ఆఫర్ లో ఒక భాగం, ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లకు వర్తిస్తుంది. విద్యార్థులకు బోర్డు పరీక్షలను ముగిసిన సమయాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సోనీ PS5పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తుంది. అయితే కొంత కాలం మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. PS5 గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ బండిల్‌కు కూడా తగ్గింపు వర్తిస్తుంది. PS5 యాక్సెసరీస్‌కు ధరలో మార్పు ఉండదు.

టెక్నాలజీ

ఈ సమ్మర్ ఆఫర్ ముగింపు తేదీని సంస్థ ఇంకా వెల్లడించలేదు

ఈ ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి సోనీ భారతదేశంలో దాదాపు 20,000 PS5 మోడళ్లను విక్రయించింది. కంపెనీ ఈ సమ్మర్ ఆఫర్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. PS5 స్టాండర్డ్ (బ్లూ-రే), డిజిటల్ ఎడిషన్ వెర్షన్‌లలో డ్యూయల్ సెన్స్ వైర్‌లెస్ కంట్రోలర్‌లు అనుకూల ట్రిగ్గర్‌లు RDNA 2 గ్రాఫిక్స్, 16GB GDDR6 RAM, 825GB స్టోరేజ్‌తో కనెక్ట్ అయిన ఆక్టా-కోర్ AMD రైజెన్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటాయి. ఈ సమ్మర్ ఆఫర్ సోనీ ఆన్‌లైన్ స్టోర్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, గేమ్స్ ది షాప్, విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా వంటి ప్రముఖ రిటైలర్‌ల ద్వారా PS5 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.