'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు. అయానోస్పియర్ భూమికి దగ్గరలో ఉంటుంది. దీనిలో ఉండే అయస్కాంత ఆయాన్ల శక్తి వల్ల ఇంధ్రధనస్సు ఏర్పడుతుంది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌ను ప్రయోగించన అనంతరం ఆకాశంలో ఎర్రటి కాంతి కనిపించింది. ఇది అయానోస్పిరిక్ హోల్‌కు సంకేతమని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి ఉపరితలం నుంచి 200-300 కిమీ ఎత్తులో రాకెట్ల ఇంజిన్లు కాలినప్పుడు అలాంటి ఎర్రటి కాంతి కనపడుతుందని అంతరిక్ష శాస్త్రవేత్త జెఫ్ బామ్‌గార్డ్నర్ చెప్పారు. ఇది ఎఫ్-ప్రాంత ఎత్తు(280కిలోమిటర్ల ఎత్తు)లో మండినందున అయానోస్పిరిక్‌కు 'రంధ్రం' పడే అవకాశం ఉందని వివరించారు.
అయానోస్పియర్ నుంచే స్పేస్ ప్రారంభం
అయానోస్పియర్ అనేది చార్జ్డ్ పార్టికల్స్‌తో నిండి ఉంటుంది. ఇక్కడి నుంచే స్పేస్ ప్రారంభమవుతుంది. వేగంగా కదిలే రాకెట్లు, వాటి ఎగ్జాస్ట్ పొగలు అయానోస్పియర్ అయనీకరణాన్ని మార్చగలవు. ఈ పరిణామం జీపీఎస్ వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫాల్కన్ 9 రాకెట్ వల్ల ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. 2017, 2022లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. భూ కక్ష్యలోకి పెలోడ్స్ మాత్రమే కాకుండా వ్యోమోగాములను పంపించే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9రాకెట్‌ను ప్రయోగిస్తోంది. ఇప్పటి వరకు ఫాల్కన్ 9 ప్రయోగాలు 240 జరగ్గా, 198 ల్యాండింగ్ అయ్యాయి.