SpaDeX: స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను చేపట్టిన విషయం విదితమే.
భవిష్యత్‌లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఈ కీలకమైన పరిజ్ఞానాన్ని సాధించేందుకు ఇస్రో మరో ముందడుగు వేసింది.
తాజాగా, స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఘన విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు.
"ఈ విజయం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపుతుంది. అసాధ్యంగా కనిపించిన డీ-డాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు విజయవంతంగా పూర్తి చేశాయి. భారత అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ వంటి భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది," అని మంత్రి ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన జితేంద్ర సింగ్
Union MoS(Ind. Charge) Science & Technology; Earth Sciences, Jitendra Singh tweets, "Congrats, team ISRO. It is heartening for every Indian. SPADEX Satellites accomplished the unbelievable De-Docking… This paves the way for the smooth conduct of ambitious future missions,… pic.twitter.com/EiT8PQqGmS
— ANI (@ANI) March 13, 2025
వివరాలు
మార్చి 15 నుంచి స్పేడెక్స్ సంబంధిత ప్రయోగాలు
ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌లో భాగంగా ఇస్రో గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అనేక ప్రయోగాల అనంతరం జనవరి 16న డాకింగ్ ప్రక్రియ (SpaDeX) ను విజయవంతంగా నిర్వహించింది.
ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.ఈ ప్రయోగ విజయవంతం కావడంతో ఇస్రో మరిన్ని పరిశోధనలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
మార్చి 15 నుంచి స్పేడెక్స్ సంబంధిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ఇటీవల వెల్లడించారు.