Sridhar Vembu: ఏఐపై శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు... పరిధి దాటితే మనుషులు ఏం చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఏఐ భవిష్యత్తులో గణితం, కోడింగ్ వంటి పనులను మనుషుల కంటే మెరుగ్గా చేయగలిగితే.. ఆ రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి ఏంటన్నదే ఆయన ప్రశ్న. గతంలో యంత్రాల రాకతో రైతులు, నేత కార్మికులు, వడ్రంగులు, కమ్మరుల పనితీరు మారినట్లే ఇప్పుడు గణిత శాస్త్రవేత్తలు, ప్రోగ్రామర్లపై కూడా ప్రభావం మొదలైందని వెంబు అభిప్రాయపడ్డారు.
Details
కోడింగ్ నుంచి గణితం వరకు ఏఐ దూకుడు
ప్రస్తుతం ఏఐ మోడళ్లు ఒకేసారి వేల లైన్ల కోడ్ రాయగల స్థాయికి చేరుకున్నాయి.
ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల అధునాతన మోడళ్లు క్లిష్టమైన గణిత సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాయి.
ఈ మార్పు కొందరికి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వెంబు మాత్రం మరో కోణాన్ని చూపించారు.
టీమ్‌లో టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి ఏఐ సహాయంతో CAD డిజైన్ తయారు చేశాడని చెప్పారు.
అంటే ఏఐ కేవలం ఉద్యోగాలను తీసుకోవడం మాత్రమే కాకుండా, కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశాలను కూడా పెంచుతోందన్నది ఆయన ఉద్దేశం.
Details
ఇక మనుషులు ఏం చేయాలి?
ఏఐ మరింత క్లిష్టమైన పనులను చేపట్టే కొద్దీ మనుషుల పని స్వభావం కూడా మారాల్సి ఉంటుందని వెంబు అంటున్నారు.
భవిష్యత్తులో ప్రకృతి, పెంపకం, సంస్కృతి, శాస్త్రాల వంటి మానవ అనుభవాలకు సంబంధించిన రంగాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చని ఆయన అభిప్రాయం.
ముఖ్యంగా ఏఐ చేయలేని మానవీయ అనుభూతులు, విలువలు, సృజనాత్మకతపై మనుషులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
అందుకే ఏఐ యుగంలో మనుషులు మళ్లీ ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత వైపు చూడాల్సిన సమయం రావచ్చని ఆయన అన్నారు.
Details
ఉద్యోగాలు పోతాయా.. లేక కొత్తవి వస్తాయా?
అయితే ఏఐ వల్ల అన్ని ఉద్యోగాలు మాయమవుతాయని వెంబు చెప్పడం లేదు.
కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాల్లో ఒక వ్యక్తి ఏఐ సహాయంతో పది మంది చేసే పనిని చేయగల పరిస్థితి రావచ్చని ఆయన గతంలో హెచ్చరించారు.
అదే సమయంలో ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు లేదా డిజిటల్ మార్కెటర్లను నియమించుకోలేని చిన్న సంస్థలు కూడా ఏఐ కారణంగా వారిని నియమించుకునే అవకాశం ఉందన్నారు.
అంటే ఉద్యోగాల సంఖ్య కంటే వాటి స్వభావం మారే అవకాశం ఎక్కువ.
ఆయన చెప్పినట్లుగా ఇది ఆర్థిక వ్యవస్థలో బాధాకరమైన మార్పు కావచ్చు.. కానీ ఉత్పాదకత 10 రెట్లు లేదా 100 రెట్లు పెరిగే అవకాశమూ ఉందన్నది మరో ఆసక్తికరమైన కోణం.