LOADING...
Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్​వాక్

Sunitha Williams: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి స్పేస్​వాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
07:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు మరోసారి స్పేస్‌వాక్ చేస్తున్నారు. జనవరి 16, 2025న ఆమె తన కెరీర్‌లో ఎనిమిదోసారి స్పేస్‌వాక్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఆమె తన 9వ స్పేస్‌వాక్ లేదా ఎక్స్‌ట్రా-వెహికులర్ యాక్టివిటీ (EVA) చేపడ్తున్నారు. దీంతో గతేడాది జూన్‌లో ISSలోకి వచ్చినప్పటి నుంచి విలియమ్స్ స్పేస్​ స్టేషన్​ నుంచి వెలుపలికి రావడం ఇది రెండోసారి కానుంది. ఆమె ఇటీవలే చేసిన, 8వ స్పేస్‌వాక్‌లో, ఆమె నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ISSకు మరమ్మతులు నిర్వహించారు. ఈసారి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రస్తుత కమాండర్ అయిన సునీతా విలియమ్స్ తన తోటి వ్యోమగామి, ఫ్లైట్ ఇంజనీర్ బారీ విల్మోర్‌తో కలిసి ISS వెలుపలికి వెళ్లనున్నారు.

వివరాలు 

92వ స్పేస్‌వాక్ 

ఇది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న 92వ స్పేస్‌వాక్ కావడం విశేషం. ప్రత్యక్ష ప్రసారం: సునీతా విలియమ్స్ 9వ స్పేస్‌వాక్‌ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ ద్వారా ఎవరైనా ఈ సంఘటనను తిలకించవచ్చు.