Sunita Williams : అంతరిక్ష కేంద్రాన్ని వీడి భూమికి పయనమైన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్!
ఈ వార్తాకథనం ఏంటి
9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమ్మీదకు తిరిగి రానున్నారు.
వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భూమికి చేరుకోవడానికి వీరు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో (SpaceX Crew Dragon) ప్రయాణిస్తున్నారు.
అన్‌డాకింగ్ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన నాసా
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తీసుకురావడం కోసం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్‌ఎస్‌కు చేరుకుంది.
అనంతరం ఈ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌ను విడిచి భూమికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది.
Details
హ్యాచ్ మూసివేత
మంగళవారం ఉదయం 8:15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
అన్‌డాకింగ్
ఉదయం 10:15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్‌ఎస్ నుంచి విడిపోయింది.
భూవాతావరణ ప్రవేశం
బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు వ్యోమనౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది.
ల్యాండింగ్
అదే రోజు తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది.
Details
నాసా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో తిరుగు ప్రయాణం
ఈ అన్‌డాకింగ్ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. శాస్త్రవేత్తలు ఈ మిషన్‌ను సునిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
వ్యోమనౌక భూమికి చేరిన తర్వాత సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఈ మిషన్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరొకరు కూడా భూమికి తిరిగి రానున్నారు.
చివరగా ఫ్లోరిడా తీరంలో ల్యాండైన తర్వాత సహాయ బృందాలు వారిని రక్షించనున్నాయి.