Page Loader
Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..!
ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..!

Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేసిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆమె భూమికి తిరిగి వచ్చే తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి విద్యార్థులతో మాట్లాడిన ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి గడపడం వల్ల కూర్చోవడం, పడుకోవడం కూడా చాలా కష్టంగా మారిందని సునీత పేర్కొన్నారు.

వివరాలు 

జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి

"నేను చాలా కాలంగా ఇక్కడ ఉన్నాను. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకాలంగా నేను నడవలేదు, కూర్చోలేదు. పడుకుని సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం కూడా కుదరడం లేదు. జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఉండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తుచేసుకోలేకపోతున్నాను"అని తెలిపారు. మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే భూమికి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ,ఇంతకాలం అంతరిక్షంలో ఉండటం షాకింగ్‌గా అనిపిస్తోందని అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. వాస్తవంగా జూన్ 14న వీరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా,వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక లోపం కారణంగా వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.

వివరాలు 

వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం

ఈ విషయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకురావడంలో బైడెన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్ల సునీతా విలియమ్స్ సహా వ్యోమగాములు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్‌ఎక్స్‌ను కోరారని, త్వరలో దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో, వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం అవుతున్నట్లు తెలుస్తోంది.