Page Loader
Sunitha Williams: ISSలో థాంక్స్ గివింగ్ జరుపుకున్న సునీతా విలియమ్స్.. ఆమె తీసుకున్న స్పెషల్‌ మీల్‌ ఏంటంటే 
ISSలో థాంక్స్ గివింగ్ జరుపుకున్న సునీతా విలియమ్స్..

Sunitha Williams: ISSలో థాంక్స్ గివింగ్ జరుపుకున్న సునీతా విలియమ్స్.. ఆమె తీసుకున్న స్పెషల్‌ మీల్‌ ఏంటంటే 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అంతరిక్షంలో థాంక్స్ గివింగ్‌ను జరపడానికి సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్‌ గివింగ్‌ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పంచుకున్న వీడియో సందేశాన్ని నాసా బుధవారం విడుదల చేసింది. "భూమిపై ఉన్న మా స్నేహితులు, కుటుంబ సభ్యులు, మమ్మల్ని మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నాం," అని సునీతా విలియమ్స్ వీడియోలో చెప్పారు. ఈ సందర్భంగా, నాసా వారు తమ వ్యోమగాములకు బటర్‌నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ (బేక్ చేసిన చికెన్) వంటి ఆహారాలను అందించినట్లు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు.

వివరాలు 

రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో సాంకేతిక లోపం

కాగా, 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్‌మోర్‌ను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది.