
చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..!
ఈ వార్తాకథనం ఏంటి
చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో పలు కొలువులు ప్రమాదంలో పడనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు చాట్‌జీపీటీ సేవలను పలు వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగు అవుతున్నాయి.
తాజాగా విద్యా ప్రయోజనాల కోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవటంలో హార్వర్డ్ యూనివర్శిటి నిమగ్నమైంది.
ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో బోధకుడిగా ఏఐ చాట్‌బాట్ ను నియమించనుంది. దీంతో ఉపాధ్యాయ రంగాన్ని సైతం చాట్ జీపీటీ వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని వార్తలు వినిపిస్తుండగా తాజాగా న్యూ టెక్నాలజీ తో టీచర్లనూ చాట్ జీపీటీ రిప్లేస్ చేయనుంది.
Details
చాట్ జీపీటీకి టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ
ఓపెన్ ఏఐ అడ్వాన్డ్స్ 3.5, జీపీటీ 4 మోడల్స్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఏఐ టీచర్ సేవలను యూనివర్శిటీ ఉపయోగించుకోనుంది.
ఈ విషయంపై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డేవిడ్ మలన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరి నాటికి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఏఐ టీచర్ ద్వారా తాము టీచర్, విద్యార్థి నిష్ఫత్తిని 1:1 సాధించగలమని భావిస్తున్నట్లు చెప్పారు.
మరోపక్క యూనివర్శిటీ గతేడాది నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసింది. అదే విధంగా చాట్ జీపీటీకి టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో హార్వర్డ్ యూనివర్శిటీ నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
సెప్టెంబర్‌లో ఈ ప్రోగ్రాం ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ సన్నాహాలు చేపట్టింది.