Page Loader
Telegram: కంపెనీలను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ సబ్జెక్టును నేర్చుకోండి: పావెల్‌ దురోవ్‌  
కంపెనీలను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ సబ్జెక్టును నేర్చుకోండి: పావెల్‌ దురోవ్‌

Telegram: కంపెనీలను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ సబ్జెక్టును నేర్చుకోండి: పావెల్‌ దురోవ్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సలహా ఇచ్చారు. భవిష్యత్తులో మంచి కంపెనీలను స్థాపించాలంటే,ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలంటే ఏ సబ్జెక్ట్‌ను ప్రాధాన్యతగా నేర్చుకోవాలో ఆయన వెల్లడించారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ పోస్ట్‌పై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కూడా స్పందించడం విశేషం. ''విద్యార్థులు లెక్కలపై (మ్యాథమెటిక్స్‌పై) దృష్టిపెట్టాలి. లెక్కలు తమ సొంత మేధస్సుపై ఆధారపడటాన్ని నేర్పిస్తాయి. లాజికల్‌గా ఆలోచించటం, సమస్యలను విడగొట్టి చూడటం, వాటిని దశల వారీగా పరిష్కరించే విధానం లెక్కల ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. ఏదైనా కంపెనీని స్థాపించాలన్నా, ప్రాజెక్టులను మేనేజ్ చేయాలన్నా ఇవే అత్యంత కీలకమైన అంశాలు'' అని పావెల్ వివరించారు.

వివరాలు 

అతికొద్ది సమయంలోనే వేల సంఖ్యలో లైకులు

ఈ పోస్టు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతికొద్ది సమయంలోనే దానికి వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. వందల సంఖ్యలో కామెంట్లు, రీ-పోస్టులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. 'ఫిజిక్స్ (లెక్కలతో పాటు)' అని కామెంట్ చేశారు. దీనికి పావెల్ దురోవ్ కూడా సమాధానంగా స్పందిస్తూ... ''+1. మీరు లెక్కల్లో ఇప్పటికే బలంగా ఉంటే.. ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం), కంప్యూటర్ సైన్స్‌ను నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరం. వాస్తవిక ప్రపంచంలో లెక్కలను అన్వయించేందుకు భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మీ తార్కిక ఆలోచనా విధానాన్ని పదునుపెట్టడమే కాదు.. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడతాయి'' అని వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పావెల్‌ దురోవ్‌ చేసిన ట్వీట్