Page Loader
Redmi 13C 5G launch: భారత మార్కెట్లోకి వచ్చేసిన రెడ్ మి 13 సీ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి వచ్చేసిన రెడ్ మి 13 సీ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే!

Redmi 13C 5G launch: భారత మార్కెట్లోకి వచ్చేసిన రెడ్ మి 13 సీ 5జీ.. ధర, ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ రెడ్ మీ బుధవారం ఇండియన్ మార్కెట్లోకి రెడ్ మీ 13సీ 5జీ(Redmi 13C 5G) ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. ఈ లేటెస్ట్ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణగా ఉంటుంది. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్‌తో పాటు MediaTek డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్ ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50MP ప్రైమరీ షూటర్‌తో AI డ్యూయల్ కెమెరా సెటప్‌, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Details

డిసెంబర్ 16న సేల్

ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, USB టైప్-C పోర్ట్‌, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ రెడ్ మీ 13C 5G స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 16 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభం కానుంది. Mi.com, ఆమెజాన్, షావోమీ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ కు ప్రత్యేక లాంచ్ ధర రూ. 9999 కాగా, 6 GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11499 గా ఉంది.