Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.
తాజాగా టెక్ దిగ్గజం ఎన్విడియా అత్యాధునిక జీఫోర్స్ ఆర్టీఎక్స్ 50 గ్రాఫిక్ కార్డులను విడుదల చేయడంతో, వీటిని కొనుగోలు చేసేందుకు జపాన్‌లో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకుంది.
టోక్యోలోని అకిహబర వద్ద ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్ పీసీకౌబౌ అవులెట్ వద్ద వందలాది మంది చైనీయులు ఈ గ్రాఫిక్ కార్డులను కొనుగోలు చేసేందుకు చేరారు.
అనుకోకుండా భారీగా జనసంద్రం కూరుకుపోవడంతో తొక్కిసలాట జరగ్గా, దుకాణం చుట్టుపక్కల ప్రాపర్టీ దెబ్బతినింది. ఈ ఘటనపై యూనిట్‌కామ్ టైజోహషిడ, పీసీకౌబౌ మాతృసంస్థ, క్షమాపణలు చెప్పింది.
'కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో 90శాతం మంది చైనా భాష మాట్లాడేవారే అని కంపెనీ తెలిపింది.
Details
ఎందుకింత డిమాండ్?
జీఫోర్స్ ఆర్టీఎక్స్ 50 గ్రాఫిక్ కార్డ్‌ను జనవరి 30 న విడుదల చేశారు.
అయితే అమెరికా విధించిన ఆంక్షల కారణంగా చైనాలో ఈ కార్డులను విక్రయించలేకపోతున్నారు.
అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధ (AI), ఆయుధ ప్రోగ్రామ్‌లను బలోపేతం చేయకుండా నిరోధించే చర్యల్లో భాగంగా, బలహీనమైన చిప్‌లను మాత్రమే చైనాకు ఎగుమతి చేస్తోంది.
ప్రస్తుతం RTX 5090 చిప్ సెకనుకు 3,352 ట్రిలియన్ ఆపరేషన్స్ నిర్వహించగలదు. కానీ, చైనాకు అనుమతించిన RTX 5090D వెర్షన్ కేవలం 2,375 ట్రిలియన్ ఆపరేషన్స్ మాత్రమే చేయగలదు.
అంటే దాదాపు 29% తక్కువ శక్తిమంతంగా ఉంటుంది. అందువల్ల చైనా గేమర్లు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో గ్రాఫిక్ కార్డులను భారీగా కొనుగోలు చేస్తున్నారు.
Details
చైనా రీసెల్లర్ల వ్యూహం
పీసీకౌబౌ స్టోర్ లాటరీ విధానాన్ని అమలు చేస్తూ RTX 50 సిరీస్ కార్డులను ప్రత్యేకంగా లాటరీ గెలిచిన వారికి విక్రయిస్తామని ప్రకటించింది.
దీంతో ఒక్కసారిగా చైనీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమెరికాలో RTX 5090 చిప్ ధర $1,999 కాగా, జపాన్‌లో $2,600.
చైనాలో దొరికే స్లో వెర్షన్ RTX 5090D ధర $2,270. దీనివల్ల చైనా రీసెల్లర్లు జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో కొనుగోలు చేసి చైనాలో సగటున $5,700కి విక్రయిస్తున్నారు.
Details
చైనా AI రంగంపై ఎన్విడియా ప్రభావం
ఇటీవల చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, మెటా ఏఐ వంటి ప్రముఖ కృత్రిమ మేధ ప్లాట్‌ఫామ్‌లకు చైనా డీప్‌సీక్ ఏఐ కొత్త సవాల్ విసురుతోంది.
Android & Apple Storeలలో టాప్ AI అప్లికేషన్‌గా ర్యాంక్ సాధించిన డీప్‌సీక్ ఏఐ అదే ఎన్విడియా చిప్‌లను ఉపయోగించి అభివృద్ధి చేశారు.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు కారణంగా చైనీయులు ఎన్విడియా అధునాతన గ్రాఫిక్ కార్డులను ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
దీనివల్ల జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో RTX 50 సిరీస్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.