Page Loader
 Lunar Eclipsc 2024: ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా?
ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా?

 Lunar Eclipsc 2024: ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్ 18, 2024, తేదీన సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం ఎంతో విశిష్టంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈసారి సెప్టెంబర్ 18న ఏర్పడే చంద్రగ్రహణం భారత్‌లో కనబడదు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ వంటి ప్రాంతాల్లో కనిపించనుంది. అంతేకాకుండా హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

Details

 మూడ్రోజుల పాటు పూర్తికాంతితో కనపడనున్న చంద్రుడు

చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న తెల్లవారు జామున 06:12 గంటలకు ప్రారంభమై, 10:17 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 5 గంటల 04 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. సోమవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మూడు రోజుల పాటు చంద్రుడు పూర్తి కాంతిలో కనిపిస్తాడని నాసా తెలిపింది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి తన స్థానాన్ని చంద్రుని ఉపరితలంపై ఉంచినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.