Upcoming Smart Phones : డిసెంబర్ 2024లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
2024 సంవత్సరం ముగిసేలోపు, పెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ నెలలో అనేక శక్తివంతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో రిలీజ్ కానున్నాయి. ఈ ఫోన్లలను భారతదేశంలో కూడా భారీ అంచనాలతో తీసుకురావాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ల వివరాలను చూద్దాం. iQOO 13 iQOO 13 ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ను భారత్‌లో డిసెంబర్ 3న లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, స్టైలిష్ అల్యూమినియం ఫ్రేమ్, IP69 రేటింగ్ , RGB LED లైట్‌లతో ప్రత్యేకంగా ఉంటాయి.
Redmi Note 14 సిరీస్
రెడ్మి Note 14 సిరీస్ డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో Redmi Note 14, Note 14 Pro, Note 14 Pro+ మొబైల్స్ ఉంటాయి. 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ప్రతి ఫోన్‌లో వేరే వేరే ప్రాసెసర్లు ఉంటాయి, MediaTek Dimensity 7300-Ultra, Snapdragon 7s Gen 3 వంటి శక్తివంతమైన ప్రాసెసర్లతో. Vivo X200 సిరీస్ Vivo X200 సిరీస్ కూడా డిసెంబర్‌లో మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ 200MP టెలిఫోటో కెమెరా లెన్స్‌తో వస్తుంది. కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు కానీ, డిసెంబర్‌లోనే విడుదల కావచ్చని అంచనా.
OnePlus 13
OnePlus 13, Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ 6.82 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో 6000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇది డిసెంబర్ చివరి లేదా 2025 జనవరిలో విడుదల కానుంది.