భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు
బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, అంగారక గ్రహాలు భూమి నుండి ఆకాశంలో చంద్రునితో వరుసలో ఉన్నట్టు కనిపించనున్నాయి. చంద్రుడు వీనస్ నుండి దూరంగా వెళ్లడం కొనసాగిస్తూ ఉండడం వలన ఆకాశంలో ఈ గ్రహాలతో కలిపి కనిపిస్తాడు. మార్చి 28న ఐదు గ్రహాలు బాగా కనిపించనుండగా, అయితే ఈరోజు మధ్యాహ్నం ఆకాశంలో మరో గ్రహాన్ని చూడగలుగుతారు. అయితే, దాని కోసం ఒక బైనాక్యులర్ అవసరం. మార్చి 28న సూర్యాస్తమయం తర్వాత, సాయంత్రం 7:30 గంటలకు సాయంత్రం ఆకాశంలో చూడవచ్చు. దీని తరువాత శుక్రుడు, యురేనస్, చంద్రుడు, అంగారక గ్రహాలు పైకి వెళ్తాయి. సూర్యాస్తమయం తర్వాత దాదాపు అరగంటకు బుధుడు, బృహస్పతి త్వరగా హోరిజోన్ క్రింద వెళతాయి.
సాయంత్రం ఆకాశంలో రెండు గ్రహాలను చూడటానికి బైనాక్యులర్లు అవసరం కావచ్చు
స్పష్టమైన ఆకాశం ఉన్నంత వరకు, ఐదు గ్రహాల వ్యాప్తి భూమిపై ఎక్కడి నుండైనా చూడచ్చు. బృహస్పతి, శుక్రుడు, అంగారక గ్రహాలు వాటి కాంతి కారణంగా కంటితో చూడగలిగినప్పటికీ, మెర్క్యురీ, యురేనస్ గుర్తించడం చాలా కష్టం. సాయంత్రం ఆకాశంలో రెండు గ్రహాలను చూడటానికి బైనాక్యులర్లు అవసరం కావచ్చు. శుక్రుడు ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులలో ఒకటి, అంగారక గ్రహం చంద్రుని దగ్గర ఎర్రటి కాంతితో ఉంటుంది, యురేనస్ శుక్రుని పైన ఆకుపచ్చని మెరుపుతో చూడచ్చు. గ్రహాలు ఆకాశంలో వరుసలో కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అవి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని అర్థం కాదు. భూమి కోణం నుండి గ్రహాల కక్ష్యలు సూర్యుని వైపు వాటిని వరుసలో ఉంచినప్పుడు ఈ రకంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.