LOADING...
OpenAI: ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ..చాట్‌జీపీటీ భద్రతా చర్యలు
ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ..చాట్‌జీపీటీ భద్రతా చర్యలు

OpenAI: ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ..చాట్‌జీపీటీ భద్రతా చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోజురోజుకూ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతూ వస్తోంది. మనం చిన్న చిన్న విషయాలను కూడా ఇప్పుడు ఏఐ పైన ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సాంకేతిక యుగంలో 'చాట్‌జీపీటీ'కి ఉన్న ప్రజాదరణ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇటీవల కాలంలో చాట్‌జీపీటీ కొన్ని హానికర కంటెంట్‌లను ఉత్పత్తి చేస్తున్నదని కొన్ని ఆరోపణలు వెలువడ్డాయి. అమెరికాలో ఒక టీనేజర్ ఆత్మహత్యకు ప్రేరేపించబడినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే విధంగా, మరొక వ్యక్తి చాట్‌జీపీటీ సూచనలతో తన కన్నతల్లిని హతమార్చిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ కారణంగా, ఆ కంపెనీ భద్రతా నిబంధనలపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది.

వివరాలు 

సందేశాలు ప్రత్యేక రివ్యూ టీంకి వెళ్తాయి

తాజాగా చాట్‌జీపీటీ వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని కలిగించే కంటెంట్ కనుక్కుంటే.. అది మానవ మోడరేటర్లు పరిశీలించనుండగా, అవసరమైతే పోలీస్ అధికారులు వరకు ఫార్వర్డ్‌ చేయబడే అవకాశం ఉందని వెల్లడించింది. స్వీయహాని (Self harm) లేదా ఇతరులకు హాని చేయడం వంటి సందర్భాల్లో, కంపెనీ ఈ విధానాలను అనుసరిస్తుందని తన బ్లాగ్‌లో తెలిపింది. వినియోగదారులు స్వీయహాని లేదా ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తం చేస్తే,చాట్‌జీపీటీ వారికి సానుభూతితో సహకరించడమే కాకుండా,ప్రొఫెషనల్ సాయం పొందేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను సూచిస్తుంది. అయితే, వినియోగదారుల గోప్యత రక్షించడానికి,ఈ సందర్భాల్లో పోలీస్‌లకు తక్షణంగా రిఫర్ చేయడాన్ని కంపెనీ చేయదు. కానీ, వినియోగదారులు స్పష్టంగా ఇతరుల ప్రాణాలకు ముప్పు చూపేలా బెదిరిస్తే, ఆ సందేశాలు ప్రత్యేక రివ్యూ టీం పరిశీలనకు వెళ్తాయి.

వివరాలు 

టీనేజర్ల కోసం పేరెంటల్‌ కంట్రోల్స్‌

వారు ప్రమాదం నిజమని భావిస్తే, ఆ చాట్ పోలీస్‌లకు ఫార్వర్డ్‌ ఫార్వర్డ్‌ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో, ఆ అకౌంట్స్ బ్లాక్ చేసే అవకాశమూ ఉంటుంది. చిన్న కాల పరిమితిలో జరిగే సంభాషణల్లో ఈ భద్రతా వ్యవస్థ బలంగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. కానీ దీర్ఘకాల చర్చల్లో లేదా పునరావృత సంభాషణల్లో భద్రత తక్కువగా ఉండే అవకాశముందని వెల్లడించింది. దీన్ని అధిగమించడానికి కొత్త రక్షణా చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అదనంగా, టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా లైసెన్స్‌డ్‌ థెరపిస్టులతో కనెక్ట్ అయ్యే సౌకర్యాలపై కూడా కంపెనీ పరిశీలన చేస్తోందని పేర్కొంది.