Page Loader
భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!
భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!

భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు భారీ గ్రహ శకలాలు, దాదాపు కిలోమీటరు వ్యాసార్థం కలిగినవి భూమివైపు దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో వాటితో అంతగా ప్రమాదమేమీ లేదని, అవి భూమిని ఢీకొట్టలేవని ప్రకటించారు. ఈ గ్రహ శకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండగా, భూమికి కాస్త దగ్గరగా మాత్రమే రాబోతున్నాయి తప్ప నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే వీటి చుట్టూ కొలత 500 నుంచి 850 మీటర్ల వరకు ఉంటుందన సైంటిస్టులు అంచనా వేశారు. సోలార్ సిస్టమ్(సౌర వ్యవస్థ) ఏర్పడిన సందర్భంలో రాతి శకలాలే వేరు పడి ఇలా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయన్నారు. వీటినే గ్రహ శకలాలు అని కూడా పిలుస్తుంటారన్నారు.

DETAILS

2030లోభూమికి మళ్లీ దగ్గరగా వస్తాయి

ఈ గ్రహ శకలాలను 488453 (1994 ఎక్స్ డీ), 2020 డీబీ5గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 488453 (1994 ఎక్స్ డీ) ఈ నెల 12న సోమవారం భూమికి సమీపానికి వస్తున్నట్లు తెలిపారు. గంటకు దాదాపుగా 77,292 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందన్నారు. ఇది భూమికి 31,62,498 కిమీ దగ్గరికి రానుందని, చివరిగా 2012లో భూమికి చేరువగా వచ్చి వెళ్లిందన్నారు. తిరిగి 2030లో సమీపానికి రానుందన్నారు. 2020 డీబీ5 గ్రహ శకలం ఈ నెల 15న భూమికి 43,08,418 కిలోమీటర్ల దగ్గరగా రానుందని సైంటిస్టులు చెప్పారు. గంటకు 34,272 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని, చివరగా 1995లో దగ్గరకు రాగా, మళ్లీ 2048లోనే రానుందన్నారు. అయితే వీటి గమనంపై నాసా అలెర్ట్ గా ఉందన్నారు.