
HL Mando: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'పార్కీ'.. దక్షిణ కొరియాకు చెందిన హెచ్‌ఎల్ మాండో కంపెనీ రూపకల్పన
ఈ వార్తాకథనం ఏంటి
డ్రైవర్ అవసరం లేకుండానే కార్లను తానే గుర్తించి పార్క్ చేసే ఓ వినూత్న రోబో వీడియో సోషల్ మీడియాను ఆక్రమించింది. ఫ్లాట్ ఆకారంలో ఉండే ఈ రోబో,కారు క్రిందికి జారుకుని,దాని టైర్లను ఎత్తి, అనుసంధానించి..ఇరుకైన ప్రదేశాల్లో కూడా చాలా నిశితంగా కారు పార్క్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈఆధునిక రోబోను దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ'హెచ్‌ఎల్ మాండో' అభివృద్ధి చేసింది.దీనికి 'పార్కీ'అనే పేరు పెట్టారు. రద్దీగా ఉండే నగర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఈ టెక్నాలజీ రూపుదిద్దుకుంది. 'లెవల్ 4 అటానమస్' వ్యవస్థ ఆధారంగా పనిచేసే ఈ రోబో,లైడార్, రాడార్,ఆప్టికల్ సెన్సార్ల సహాయంతో తన పరిసరాలను విశ్లేషించి,ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సురక్షితంగా కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.
వివరాలు
ఈ అత్యాధునిక టెక్నాలజీ ఖరీదు కూడా ఎక్కువే
అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది "ఇది వాస్తవమేనా? లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించారా?" అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 'గ్రోక్' అనే ఏఐ టూల్ స్పందిస్తూ, ఈ విధమైన సాంకేతికత ఇప్పటికే వాస్తవంగా అభివృద్ధి చెంది, 2024 నుంచే చైనా, ఐరోపా దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వాడకంలో ఉన్నట్లు వివరించింది. ఈ అత్యాధునిక టెక్నాలజీ ఖరీదు కూడా ఎక్కువే. 'పార్కీ' రోబోల జత ధర సుమారుగా 2 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 1.6 కోట్లు ఉంటుందని సమాచారం.
వివరాలు
2030 నాటికి గణనీయంగా విస్తరించనున్న.. ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీ మార్కెట్
విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కాంప్లెక్స్‌లలో పార్కింగ్ స్థలాన్ని మెరుగుగా వినియోగించేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధితో, ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీ మార్కెట్ 2030 నాటికి గణనీయంగా విస్తరించనున్నదని అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెన్సార్ల సాయంతో పనిచేసే లెవల్ 4 అటానమస్ టెక్నాలజీ
Fully autonomous valet robot that parks, retrieves, and navigates tight spaces with ease. pic.twitter.com/q04mnu3QIU
— Moments that Matter (@_fluxfeeds) July 5, 2025