LOADING...
Vivo X100 : లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది
లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

Vivo X100 : లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2023
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీవో సంస్థ నుంచి త్వరలో సరికొత్త స్మార్ట్‌ ఫోన్ వివో ఎక్స్ 100 లాంచ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ని నవంబర్ 13న వివో సంస్థ లాంచ్ చేయనుంది. అయితే లాంచ్‌కి ముందే ఈ మొబైల్స్‌లో పలు ఫీచర్స్, ధర వంటి వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఆన్‌లైన్‌లో లీకైన సమాచారం మేరకు, వివో ఎక్స్ 100లో 120 హెడ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడన 6.78 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే ఉండనుంది. ఇది యూజర్‌కి ఎక్స్‌పీరియన్స్ స్మూత్‌గా, ఇంప్రెసివ్ గా ఉండనుంది. ఈ మోడల్‌లో 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ అల్ట్రావైడ్, 64 ఎంపీ పెరిస్కోప్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉండనుంది.

Details

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా

ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ వివో కొత్త స్మార్ట్ ఫోన్‌లో 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉండనుంది. ఎల్​పీడీడీఆర్​5టీ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ దీని సొంతం. ఇందులో 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్, బ్లూటూత్​ 5.4, ఇన్​ఫ్రారెడ్​ సెన్సార్​, వైఫై-7, ఎన్​ఎఫ్​సీ వంటి కనెక్టివిటీ వంటి ఫీచర్స్​ ఉండనున్నాయి. ఎక్స్​100లో 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉంటాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.45,550గా ఉండనుంది.