LOADING...
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెంట్ క్రియేషన్ కోసం, మరికొందరు వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు. మీకూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా దాదాపు 17.5 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల డేటా లీక్ అయిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని కోరుతూ ఇమెయిల్స్‌, నోటిఫికేషన్‌లు అందుకుంటున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే అత్యంత జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Details

యూజర్లను తప్పుదారి పట్టిస్తున్నారు

సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం, ఇది ఖాతా హ్యాకింగ్‌కు సంబంధించిన కొత్త తరహా మోసం. సైబర్ నేరగాళ్లు యూజర్లను తప్పుదారి పట్టించి వారి ఖాతాలపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడుల్లో పంపే ఇమెయిల్స్‌ పూర్తిగా నిజమైనవిగా కనిపించడం గమనార్హం. అవి ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఐడీ నుంచే వచ్చినట్లు అనిపిస్తాయి. దీంతో వినియోగదారులు సులభంగా మోసపోతున్నారు. 17.5మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించిన డేటా 'బ్రీచ్ ఫోరమ్స్' అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు 'పాస్‌వర్డ్ రీసెట్ అటాక్' అనే కొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఈ విధానంలో హ్యాకర్లు నేరుగా పాస్‌వర్డ్ మార్చరు. బదులుగా ఇన్‌స్టాగ్రామ్ సిస్టమ్ ద్వారా మీ ఖాతాకు పాస్‌వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ పంపిస్తారు.

Details

 టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి

ఆ ఇమెయిల్‌ను నిజమైన భద్రతా హెచ్చరికగా భావించిన యూజర్లు రీసెట్ లింక్‌పై క్లిక్ చేస్తారు. ఇదే వారి ఖాతాను ప్రమాదంలోకి నెట్టే పొరపాటు అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా హ్యాకర్లు ఖాతాపై పూర్తి నియంత్రణ పొందే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా పాస్‌వర్డ్ మార్చాలని రిక్వెస్ట్ చేయకపోతే, ఇలాంటి ఇమెయిల్స్‌ను పూర్తిగా విస్మరించడం ఉత్తమం. అలాగే మీ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచుకోవాలంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరిగా ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫీచర్ అమల్లో ఉంటే, హ్యాకర్ మీ పాస్‌వర్డ్‌ను పొందినప్పటికీ ఖాతాలోకి లాగిన్ కావాలంటే అదనపు భద్రతా తనిఖీని తప్పనిసరిగా దాటాల్సి ఉంటుంది. దీంతో మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు మరింత రక్షణ లభిస్తుంది.

Advertisement