Page Loader
Orupouche virus: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌.. ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ? 
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌.. ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ?

Orupouche virus: ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌.. ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి డెంగ్యూ, మలేరియా. అయితే తాజాగా మరో కొత్త దోమల వ్యాధి గుర్తించబడింది.ప్రస్తుతం పలు దేశాల్లో ఇది కలకలం రేపుతోంది. ఈ కొత్త దోమ వ్యాధి పేరు 'ఓరోపౌచ్'. ఇటలీలో మొదటి కేసు నమోదు గత ఏడాది జూన్ నెలలోనే ఇటలీలో ఓరోపౌచ్ జ్వరానికి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. ఇది దోమల ద్వారా వ్యాపించే వ్యాధిగా గుర్తించారు.జూన్ 15న ఐరోపా ఖండంలోని ఇటలీలో ఈ వైరస్ తొలి కేసు నిర్ధారించబడింది. లాటిన్ అమెరికా,కరేబియన్ ప్రాంతాల్లో ఈ జ్వరం ప్రబలంగా ఉంది. ఇటలీలో ఈ వ్యాధితో బాధపడిన వ్యక్తి కరేబియన్ ప్రాంతాల నుంచి తిరిగివచ్చినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఎలా వ్యాపిస్తుంది? 

ఓరోపౌచ్ అనే ఈ వైరస్ మిడ్జెస్ (చిన్నదోమలు) ఇతర కొన్ని దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది గత కొంతకాలంగా దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో కనిపించినప్పటికీ, 2025లో కొన్ని కొత్త దేశాల్లో ఇది వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ గతంలో కనిపించని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజలకు అవగాహన కలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వివరాలు 

ఓరోపౌచ్ లక్షణాలు ఎలా ఉంటాయి? 

ఈవైరస్ ఒక్క మనిషి నుంచి మరో వ్యక్తికి నేరుగా వ్యాపించే అవకాశాలు ఇప్పటివరకు గుర్తించబడలేదు. కానీ దోమకాటు ద్వారా మాత్రం ఇది సులభంగా వ్యాపిస్తుంది.దీనిలో వచ్చే లక్షణాలు డెంగ్యూకు దగ్గరగా ఉంటాయి. వైరస్ శరీరంలోకి వచ్చిన నాలుగు నుంచి ఎనిమిది రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఇవి: జ్వరం,తలనొప్పి,చలి,కీళ్లు బిగుసుకోవడం,కీళ్లలో నొప్పి,కొన్ని సార్లు వికారం, వాంతులు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా ఒక వారం పాటు ఉంటాయి. తర్వాత కోలుకుంటారు. ప్రాణహానికి కారణం కావడం జరగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అయితే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. డెంగ్యూతో పోలిస్తే ఇది తక్కువ ప్రమాదకరమైనదే అయినా,దీని వల్ల శరీరంలో జరిగే ప్రభావాలను ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

ఇన్ఫెక్షన్‌కు చికిత్స, వ్యాక్సిన్ 

ఈ వ్యాధికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే, కొన్ని యాంటీ వైరల్ ఔషధాల ద్వారా చికిత్స అందించగలుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాధి గురించిన స్పష్టమైన సమాచారం ఇప్పటికీ పరిమితంగానే ఉందని, 2023 మేలో జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ ఆఫ్ ట్రాపిక్స్ లో ప్రచురితమైన పరిశోధన పేర్కొంది. ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించగల ప్రమాదాన్ని కూడా తేల్చలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు 

పర్యావరణ మార్పుల ప్రభావం 

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, పర్యావరణ మార్పులు, అడవుల తగ్గుదల, వృక్షసంపద నాశనం వంటి అంశాలు ఈ వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇవి ఓరోపౌచ్ వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణమని నిరూపణలు లేకపోయినా, ఈ అంశాల ప్రభావాన్ని విస్మరించలేమని వారు సూచిస్తున్నారు.