
#NewsBytesExplainer: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ఎలా శిక్షణ ఇస్తారు? ఎందుకు క్వారంటైన్‌లో ఉంచుతారు?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి ఒక భారతీయుడి ఎంపిక జరగడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
ఆక్సిమ్ 4 మిషన్లో భాగంగా ఈ ప్రయాణానికి నలుగురు వ్యోమగాములు వెళుతున్నారు.
వారిలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు.
ఈ మిషన్‌కు కమాండర్‌గా పెగ్గీ విట్సన్, పైలట్‌గా శుభాన్షు శుక్లా, మిషన్ స్పెషలిస్ట్‌లుగా పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాప్ ఉన్నారు.
అయితే, ఈ ప్రోగ్రామ్ కోసం ఈ నలుగురితో పాటు మరో ముగ్గురికి కూడా శిక్షణ ఇచ్చారు.
వివరాలు
ఏడుగురికి శిక్షణ ఎందుకు?
ఇంతగా నలుగురు ప్రయాణిస్తుంటే,ఏడుగురికి శిక్షణ ఎందుకు ఇస్తారు అనే సందేహం రావచ్చు.
అంతరిక్ష ప్రయాణాలు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే కావడం,లాంచ్ తేది ఖరారైన తర్వాత ఏవైనా సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే అవకాశాల కోసం బ్యాకప్ టీమ్‌ను సిద్ధం చేస్తారు.
వాతావరణ పరిస్థితుల వల్ల మిషన్ వాయిదా పడే అవకాశాలు ఉన్నా,వ్యోమగాముల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వెంటనే వారి స్థానంలో బ్యాకప్ సభ్యుల్ని పంపే అవకాశం ఉంటుంది.
ఈమిషన్‌లో ప్రధాన నలుగురితో పాటు మిగిలిన ముగ్గురు బ్యాకప్ వ్యోమగాములు సిద్ధంగా ఉన్నారు.
శుభాన్షుకు బ్యాకప్‌గా ఇస్రోకు చెందిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్,కమాండర్ పెగ్గీకి మైకేల్ లోపెజ్, మిషన్ స్పెషలిస్టుగా గుల్యా సెరెనీ ఉన్నారు.
వీరందరికీ మిషన్ సభ్యులతో సమానంగా శిక్షణ ఇవ్వబడుతుంది.
వివరాలు
వ్యోమగాముల శిక్షణ ఎలా ఉంటుంది?
1984లో రాకేశ్ శర్మ అంతరిక్షానికి వెళ్లినప్పుడు కూడా రవీష్ మల్హోత్రాకు బ్యాకప్ శిక్షణ ఇచ్చినట్లు, ఇపుడు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అంతరిక్షంలో పని చేయాలంటే శారీరక, మానసికంగా ఎంతో బలంగా ఉండాలి.
అంతేకాక, టెక్నికల్ నైపుణ్యాలు, భాషాపరమైన పరిజ్ఞానం, విపత్కర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి విషయాల్లో సమగ్ర శిక్షణ అవసరం.
టెక్నికల్ - ఆపరేషనల్ శిక్షణ
నాసా ఇచ్చిన సమాచారం ప్రకారం,స్పేస్ స్టేషన్ నమూనాను భూమ్మీదే తయారు చేసి,అందులో వ్యోమగాములకు లాంచింగ్, డాకింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇస్తారు.
వర్చువల్ రియాలిటీ ద్వారా స్పేస్ వాక్ శిక్షణనూ ఇస్తారు. అలాగే రోబోటిక్ సిస్టమ్‌ల ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
వివరాలు
మైక్రో గ్రావిటీ ట్రైనింగ్
అంతరిక్షంలోని భార రహిత స్థితికి అలవాటయ్యేలా, పెద్ద స్విమ్మింగ్ పూల్‌లలో స్పేస్ స్టేషన్ నమూనాను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు.
పారబోలిక్ ఫ్లైట్ టెస్టులు ద్వారా మైక్రో గ్రావిటీ అనుభవాన్ని కలుగజేస్తారు. టి-38 జెట్ శిక్షణ ద్వారా అధిక G-ఫోర్స్‌లో పని చేయగల సామర్థ్యాన్ని పెంచుతారు.
శారీరక - జీవన శిక్షణ
వ్యోమగాములు మైక్రో గ్రావిటీలో ఎలా పనిచేయాలో,భూమ్మీదకు తిరిగొచ్చే సమయంలో అధిక గ్రావిటీని ఎలా తట్టుకోవాలో ప్రత్యేక వ్యాయామాలు చేయించబడతాయి. అరణ్యాలు, ఎడారులు, సముద్ర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, బతికిపోయే కృషిపై కూడా శిక్షణ ఉంటుంది.
వివరాలు
భాషా, సాంస్కృతిక శిక్షణ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వారితో కలిసి పనిచేయాల్సి ఉండడం వల్ల, సంబంధిత భాషలు, సంస్కృతులు, ప్రవర్తన నియమాలపై అవగాహన కలిగించేందుకు శిక్షణ ఇస్తారు.
వైద్య సహాయం- క్వారంటైన్
ప్రతి వ్యోమగామికి పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ లో అనారోగ్యం తలెత్తినప్పుడు స్వయం చికిత్స, సహచరుల వైద్య సంరక్షణపై శిక్షణ ఉంటుంది. చివరిగా, ప్రయాణానికి ముందు వారిని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా వైరస్, బాక్టీరియా రహితంగా స్పేస్ స్టేషన్‌కి పంపుతారు.
వివరాలు
ప్రయోగాలపై శిక్షణ
అంతరిక్షంలో చేయాల్సిన ప్రతి ప్రయోగంపై, డేటా సేకరణ, టెక్నికల్ సమస్యల పరిష్కారం, స్పేస్ వాక్ వంటి కీలక ఆపరేషన్లపై పూర్తిస్థాయి శిక్షణ ఉంటుంది.
ప్రయాణానికి ముందటి దశ
ప్రశిక్షణ ముగిసిన అనంతరం, ఫిట్నెస్ టెస్టులు, వైద్య పరీక్షలు పూర్తయ్యాక లాంచ్‌కు కొన్ని రోజులు ముందు స్పేస్ సూట్‌లు వేసి వ్యోమగాములు సిద్ధమవుతారు.
లాంచ్‌కు ముందు కుటుంబ సభ్యులతో పరిమితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. మానసిక స్థైర్యానికి కావలసిన మద్దతును అందిస్తారు. అంతా సిద్ధమయ్యాకే ప్రయాణం ప్రారంభమవుతుంది.