Page Loader
WhatsApp iPad : వాట్సాప్ వచ్చేసింది.. ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ విడుదల!
వాట్సాప్ వచ్చేసింది.. ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ విడుదల!

WhatsApp iPad : వాట్సాప్ వచ్చేసింది.. ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేక యాప్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐప్యాడ్ యూజర్లకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ అందింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ ప్రత్యేక వెర్షన్‌ను మెటా విడుదల చేసింది. ఇప్పుడు ఐప్యాడ్‌లోనూ వాట్సాప్‌ యాప్‌ అందుబాటులో ఉండనుంది. టాబ్లెట్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్‌ ద్వారా మెసేజింగ్‌తో పాటు ఆడియో, వీడియో కాలింగ్‌లకు అవకాశం కల్పించారు. ఐప్యాడ్‌ యూజర్లు 32 మంది వరకు వీడియో, ఆడియో కాల్స్‌ నిర్వహించవచ్చు. స్క్రీన్‌ షేరింగ్‌ చేసే వీలుతో పాటు ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాల సహాయంతో కాలింగ్‌ చేయొచ్చు. మెటా రూపొందించిన ఈ యాప్‌ స్టేజ్‌ మేనేజర్‌, స్ప్లిట్‌ వ్యూ, స్లయిడ్‌ ఓవర్‌ వంటి iPadOS మల్టీటాస్కింగ్ ఫీచర్లకు పూర్తి మద్దతును ఇస్తుంది.

Details

వాట్సాప్ వాడేందుకు అవకాశం

వేరే అప్లికేషన్లు ఉపయోగిస్తూనే వాట్సాప్‌ను కూడా ఒకేసారి వాడేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు ఆపిల్‌ పెన్సిల్‌, మ్యాజిక్‌ కీబోర్డ్‌లకు కూడా ఈ యాప్‌ సపోర్ట్‌ ఇస్తుంది. బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలోనూ మెసేజ్‌లు పంపడం, కాల్‌లో ఉన్నపుడే ట్రిప్ ప్లాన్ కోసం సెర్చ్ చేయడం వంటి మల్టీటాస్కింగ్ కార్యకలాపాలు సులభంగా చేయొచ్చు. ఈ యాప్‌ వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ప్రైమరీ ఫోన్‌తో లింక్‌ చేయాల్సిన అవసరం లేకుండానే, అన్ని చాట్స్‌, డేటా, మీడియా సమాచారం ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ డివైజ్‌లలో ఆటోమేటిక్‌గా సింక్‌ అవుతుంది. చాట్‌ లాక్‌ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమ గోప్యతను కూడా పరిరక్షించుకోవచ్చు.

Details

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి? 

ఐప్యాడ్‌ యూజర్లు యాప్‌ స్టోర్‌ ద్వారా కొత్త వాట్సాప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. త్వరలోనే మెటా ఈ యాప్‌కు మరిన్ని అప్‌డేట్స్‌, ఫీచర్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ కొత్త అప్‌డేట్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ లేదా పూర్తి వివరాలను మెటా అధికారికంగా ప్రకటించలేదు.