
Whatsapp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సేవ్ చేద్దామంటే కుదరదు!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.యూజర్ల గోప్యతను మరింత బలోపేతం చేయడానికి, వ్యక్తిగత చాట్స్, గ్రూప్ చాట్స్‌లో "అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ" అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్‌ను యాక్టివ్ చేస్తే, మీరు పంపే మీడియాను ఇతర వ్యక్తులు డౌన్‌లోడ్ చేయడం,సేవ్ చేసుకోవడం లేదా ఎక్స్‌పోర్ట్ చేయడం చేయలేరు.
వాట్సప్ అధికారిక బ్లాగ్ ప్రకారం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఫేజ్ వైజ్‌గా విడుదల చేయబడుతోంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
వివరాలు
వ్యక్తిగత మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా నివారించవచ్చు
ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే, మీరు పంపే వ్యక్తిగత మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా నివారించవచ్చు.
అవతలి వ్యక్తి చాట్‌ను వేరే వ్యక్తులకు పంపినా, వాట్సప్ బయట సోషియల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వాటిని పంచుకోవడం సాధ్యం కాదు.
అంతేకాక, ఎవరైనా ఆ చాట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నా, "Cannot export chat" అనే సందేశమే కనిపిస్తుంది.
వాట్సప్ గ్రూప్‌లలో ఉండే ప్రతి ఒక్కరినీ మనం తప్పనిసరిగా గుర్తించలేము.
ముఖ్యంగా గోప్యమైన విషయాలపై చర్చ జరిగే సందర్భాల్లో, మన చాట్ సమాచారం ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశముంది.
అటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది.
వివరాలు
యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి
ఈ సదుపాయాన్ని వినియోగించాలంటే, మీకు అవసరమైన చాట్ తెరిచి, ఆ చాట్ పేరుపై ట్యాప్ చేసి 'అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మీ వాట్సప్ యాప్ తాజా వెర్షన్‌లో ఉంటే ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండొచ్చు. లేకపోతే, వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించబడింది.