విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం
వాట్సాప్ విండోస్ కోసం కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను ప్రారంభించింది, ఇందులో మెరుగైన కాలింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. కొత్త వెర్షన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే వాట్సాప్ ని ఉపయోగించే అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో కూడా మొబైల్ యాప్‌లో లాగానే 32 మందితో ఆడియో కాల్ మాట్లాడచ్చు. వాట్సాప్ 2021లో మల్టీ-డివైస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ప్రస్తుత ఖాతాను ఒకేసారి వివిధ డివైజెస్ లో ఉపయోగించుకునే ఫీచర్స్ తో పాటు, డెస్క్‌టాప్ అనుభవాన్ని మెరుగుపరచడంపై పనిచేస్తోంది. వాట్సాప్ మొబైల్ వెర్షన్ లాగానే, తాజా డెస్క్‌టాప్ యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, కాలింగ్, మీడియా షేరింగ్ కు సపోర్ట్ ఇస్తుంది.
వాట్సాప్ విండోస్ వినియోగదారులకు తెలిసిన ఇంటర్‌ఫేస్‌తో రూపొందింది
ఇప్పుడు కొత్త డెస్క్‌టాప్ యాప్‌లో 8 మందితో వీడియో కాల్, 32 మందితో ఆడియో కాల్ మాట్లాడచ్చు. భవిష్యత్తులో ఈ పరిమితిని పెంచాలని కంపెనీ ఆలోచిస్తుంది. కొత్త విండోస్ డెస్క్‌టాప్ యాప్ వేగంగా లోడ్ అవుతుంది. వాట్సాప్ విండోస్ వినియోగదారులకు తెలిసిన ఇంటర్‌ఫేస్‌తో రూపొందిందని కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. Mac డెస్క్‌టాప్‌ల కోసం వాట్సాప్ కూడా ఒక యాప్‌ను పరీక్షిస్తోంది, ఇది ప్రస్తుతం బీటా దశలో ఉంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లకు అనుకూలమైన కొత్త బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. డెస్క్‌టాప్‌లో వాట్సాప్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ కి వెళ్ళాలి. ఇప్పటికే యాప్ ఉన్నవారు, తాజా ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి అప్‌డేట్ చేయాలి.