
Whatsapp status: వాట్సప్ స్టేటస్‌లో మరో ఫీచర్.. తగ్గిన ఫొటో ఎడిటింగ్ బాధలు
ఈ వార్తాకథనం ఏంటి
కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. అయితే, ఒకటికంటే ఎక్కువ ఫొటోలు స్టేటస్‌లో పెట్టాలంటే వాటిని ఒక్కో ఫొటోగా వేర్వేరు అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. నాలుగైదు ఫొటోల్ని ఒక్క సారి కలిపి ఒకటే స్టేటస్‌గా పెట్టాలంటే, ఇప్పటివరకు యూజర్లు థర్డ్-పార్టీ యాప్‌ల సహాయంతో వాటిని ఎడిట్ చేసి, ఆపై వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా వాట్సప్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వాట్సప్‌లోనే ఫొటోలు కలిపి కొలేజ్ రూపంలో స్టేటస్‌గా పెట్టుకోవడానికి ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
ఫొటోలన్నీ ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ఒకే స్టేటస్‌గా పెట్టుకోవడం ఇప్పుడు సులభం
ఇది మ్యూజిక్ యాడ్ చేసే సదుపాయం తరువాత మరో ప్రియమైన ఫీచర్. ఈ కొత్త బిల్ట్-ఇన్ ఎడిటర్ సహాయంతో ఒకేసారి ఆరు వరకు ఫొటోలు ఎంచుకుని,వాటిని మీకు నచ్చిన ఆకారంలో కొలేజ్ చేయవచ్చు. ముఖ్యమైన ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలన్నీ ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ఒకే స్టేటస్‌గా పెట్టుకోవడం ఇప్పుడు సులభం అయింది. వాట్సప్ స్టేటస్‌లో ఫొటోలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు'లేఔట్' అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీరు గ్యాలరీ నుంచి కావలసిన ఫొటోలను ఎంచుకొని,స్టేటస్‌గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కొందరు యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి రాగా,మిగతా వారికీ త్వరలో రాబోతుంది. ఇదే కాకుండా,త్వరలో వాట్సప్ స్టేటస్‌లో మ్యూజిక్ స్టిక్కర్స్,ఫొటో స్టిక్కర్స్ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు కూడా వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.