Page Loader
iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్
ఇటీవలే పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్

iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 16, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ iOS వినియోగదారులకు కెమెరా మోడ్‌ అందించడం కోసం పని చేస్తోంది. ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే, WABetaInfo ద్వారా, రాబోయే ఫీచర్ ఎలా పని చేస్తుందో కొంత సమాచారం బయటికి వచ్చింది. కెమెరా మోడ్ iOS వినియోగదారులకు వేగంగా 'ఫోటో' నుండి 'వీడియో' మోడ్‌కి మార్చడం సులభమవుతుంది. డిసెంబర్ 2022లో వాట్సాప్ బీటా యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం కెమెరా మోడ్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ వీడియో రికార్డింగ్ కొంచెం కష్టంగా ఉంది ముఖ్యంగా ఎక్కువసేపు వీడియో తీయాలనుకున్నప్పుడు ఆ గుండ్రటి బటన్‌ను నొక్కి పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఈ కెమెరా మోడ్‌ని ఉపయోగించి, ఫోటో నుండి వీడియోకి మారడం సులభమవుతుంది.

వాట్సాప్

రికార్డింగ్‌ను కోసం బటన్‌ను నొక్కితే సరిపోతుంది

రికార్డింగ్‌ను ప్రారంభించడానికి/ముగించడానికి బటన్‌ను మాత్రమే నొక్కితే సరిపోతుంది. iOS వాడుతున్న వారికి ఈ కెమెరా మోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అకౌంట్ లో పైన ఎడమవైపు మూలన ఉన్న కెమెరా సింబల్ పైన నొక్కితే వాట్సాప్ కెమెరా ఆన్ అవుతుంది. అప్పుడు క్రిందన గుండ్రటి బటన్ క్రింద రెండు ఆప్షన్స్ అంటే వీడియో లేదా ఫోటో అని వస్తాయి. డిఫాల్ట్‌గా, ఫోటోకి సెట్ అయి ఉంటుంది. అందువల్ల, వీడియోకు మారిన తర్వాత, రికార్డింగ్ ప్రారంభించడానికి క్లిక్ చేయచ్చు. ఇటీవలే వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. సాధారణ, వ్యాపార బీటా యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఇతర యాప్‌లను ఉపయోగించే వీలు కనిపిస్తుంది.