Page Loader
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ .. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్,డేటా సేవింగ్!
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ .. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్,డేటా సేవింగ్!

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ .. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్,డేటా సేవింగ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ వినియోగదారులకు డేటాను ఆదా చేసేందుకు ఉపయోగపడే మరో కొత్త ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ ద్వారా యూజర్లు ఆటోమేటిక్‌ డౌన్‌లోడ్ అయ్యే మీడియా ఫైల్స్‌పై పూర్తి నియంత్రణ పొందనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం WhatsApp 2.25.18.11 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తమ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు ఏ క్వాలిటీలో ఉండాలన్నదాన్ని వినియోగదారులే ఎంచుకునే వెసులుబాటు కలుగుతోంది.

వివరాలు 

అప్‌డేట్‌ బీటా టెస్టర్లకు మాత్రమే

ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లుకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఇది ఇతర వినియోగదారులందరికీ కూడా క్రమంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ అప్‌డేట్‌ ద్వారా ఆటో-డౌన్‌లోడ్ అయ్యే మీడియా క్వాలిటీని యూజర్‌ తానే నిర్ణయించుకోగలగడం విశేషం. తాజా ఫీచర్‌ వివరాలను వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ వెల్లడించింది. యూజర్లు ఇప్పుడు స్టాండర్డ్ క్వాలిటీ లేదా హెచ్‌డీ క్వాలిటీలో మీడియాను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈ అప్‌డేట్‌ కల్పిస్తుంది.

వివరాలు 

ట్యాప్ చేస్తే రెండు ఎంపికలు

ఎవరైనా ఈ ఫీచర్‌ను పరీక్షించాలని ఆసక్తి కలిగి ఉంటే, బీటా టెస్టర్‌గా చేరి కింద చెప్పిన స్టెప్స్‌ను అనుసరించవచ్చు: వాట్సాప్ సెట్టింగ్స్‌కి వెళ్లండి అక్కడ 'స్టోరేజ్ అండ్ డేటా' అనే విభాగాన్ని సెలెక్ట్ చేయండి 'మీడియా ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ' అనే కొత్త ఆప్షన్‌ కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేస్తే రెండు ఎంపికలు కనిపిస్తాయి: స్టాండర్డ్ క్వాలిటీ: ఈ ఎంపిక మీడియా ఫైళ్లను కాంప్రెస్‌ చేసి స్టోరేజ్‌ను ఆదా చేస్తుంది. డేటా వినియోగం తక్కువగా ఉంటుంది. హెచ్‌డీ క్వాలిటీ: ఈ ఎంపిక మీడియా ఫైళ్లను అధిక రిజల్యూషన్‌తో డౌన్‌లోడ్ చేస్తుంది. క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది, కానీ ఎక్కువ డేటా, స్టోరేజ్ అవసరమవుతుంది.

వివరాలు 

త్వరలోనే మరింత మంది యూజర్లకు..

ఒకరికి హెచ్‌డీ క్వాలిటీలో ఫొటో లేదా వీడియో పంపినపుడు వాట్సాప్ రెండు వేరియంట్లను - స్టాండర్డ్, హెచ్‌డీ ఫార్మాట్‌లలో తయారుచేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా యూజర్‌ ఎంచుకున్న ఎంపిక ప్రకారం వాటిలో ఏదైనా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అవుతుంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే మరింత మంది యూజర్లకు కూడా ఇది లభ్యమవుతుందని వాట్సాప్ అధికారికంగా వెల్లడించింది. మీరు కూడా దీన్ని వాడాలనుకుంటే మీ వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ వల్ల డేటా, స్టోరేజ్ ఖర్చును తగ్గించుకోవచ్చు.