WhatsApp Travel eSIM: వాట్సాప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్.. ట్రావెల్ eSIMలకు సపోర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాలకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ కోసం ప్రత్యేక సిమ్ కార్డులు కొనడం లేదా వైఫై కోసం వెతకడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఈ ఇబ్బందిని తగ్గించే దిశగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇకపై యాప్‌లోనే ట్రావెల్ eSIMలను వెతకడం, ఇన్‌స్టాల్ చేసుకోవడం, వాటిని నిర్వహించుకోవడం సాధ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.47.10 అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఆండ్రాయిడ్ అథారిటీ గుర్తించింది. అయితే ప్రస్తుతం ఇది పరీక్షల దశలోనే ఉంది.
Details
గమ్యస్థానం చెబితే eSIM వివరాలు!
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తాము వెళ్లాలనుకుంటున్న దేశం లేదా ప్రాంతం పేరును వాట్సాప్‌లో నమోదు చేయవచ్చు.
దానికి అనుగుణంగా అక్కడ పనిచేసే eSIM ప్లాన్ల వివరాలను యాప్ చూపించే అవకాశం ఉంది.
అవసరాన్ని బట్టి నిర్ణీత డేటా పరిమితి ఉన్న ప్లాన్లు, అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు కూడా కనిపించవచ్చు.
అయితే అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే eSIM ఇన్‌స్టాలేషన్ ప్రక్రియతోనూ వాట్సాప్ అనుసంధానం కానున్నట్లు తెలుస్తోంది.
Details
డేటా ఎంత మిగిలిందో కూడా తెలుసుకోవచ్చు
eSIM కొనుగోలు చేసిన తర్వాత దాని వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేకుండా నిర్వహణ టూల్స్‌ను కూడా వాట్సాప్ తీసుకురావచ్చు.
కొనుగోలు చేసిన eSIMలు, వాటి యాక్టివేషన్ స్థితి, గడువు తేదీ, మిగిలిన డేటా వివరాలను యాప్‌లోనే చూసుకోవచ్చు.
డేటా తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్లాన్ గడువు ముగియబోతున్నప్పుడు హెచ్చరికలు వచ్చే అవకాశం ఉంది. eSIM ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను వివరించే పరిచయ స్క్రీన్లను కూడా జోడించనున్నట్లు సమాచారం.
Details
గమ్యస్థానానికి చేరగానే ఆటోమేటిక్ యాక్టివేషన్!
ఈ ఫీచర్‌లో ఆసక్తికరమైన అంశం ఆటోమేషన్. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు eSIM ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకురావచ్చు.
దీనివల్ల అవసరం లేకుండానే డేటా ఖర్చవకుండా ఉంటుంది. అయితే ఈ సదుపాయం అన్ని ఫోన్లలో పనిచేయకపోవచ్చు. ముఖ్యంగా పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో పరిమితులు ఉండే అవకాశం ఉంది.
యాప్ కోడ్‌లో కనిపించిన 'Powered by %1$s' అనే పదాలు మరో సంస్థతో భాగస్వామ్యం ఉండొచ్చని సూచిస్తున్నాయి. ఆ సంస్థ ఏదన్నది ఇంకా తెలియాల్సి ఉంది.