LOADING...
WhatsApp: టాక్‌బ్యాక్‌, ఫొటో ఎడిట్‌.. వినియోగదారులు ఇప్పుడు Meta AIకి వాయిస్ కమాండ్‌లు ఇవ్వవచ్చు
టాక్‌బ్యాక్‌, ఫొటో ఎడిట్‌.. వినియోగదారులు ఇప్పుడు Meta AIకి వాయిస్ కమాండ్‌లు ఇవ్వవచ్చు

WhatsApp: టాక్‌బ్యాక్‌, ఫొటో ఎడిట్‌.. వినియోగదారులు ఇప్పుడు Meta AIకి వాయిస్ కమాండ్‌లు ఇవ్వవచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌బుక్‌కు చెందిన మెటా (Meta) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రేసులో వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp)లో మెటా ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ, తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. రియల్‌ టైమ్‌ కన్వర్జేషన్‌ సదుపాయాన్ని అందించడం ద్వారా, AI సంభాషణల్ని మెరుగుపరచింది. అలాగే, ఫొటోలను ఇష్టానికి అనుగుణంగా మార్చే ఫీచర్లను కూడా మెటా ఏఐలో చేర్చింది. ఈ విషయాన్ని వాట్సప్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది, అలాగే మూడు కొత్త ఫీచర్లకు సంబంధించిన ఫొటోలతో కూడిన సమాచారం కూడా అందించింది.

వివరాలు 

మాట్లాడండి 

మీ స్వంత వాయిస్‌తో మెటా ఏఐతో రియల్‌ టైమ్‌ సంభాషణలు జరపడం ఇప్పుడు సాధ్యమైంది. మీరు ఏదైనా ప్రశ్న అడగగానే, సంబంధిత విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వగలదు. దీని ద్వారా మీరు ప్రశ్నలు అడగవచ్చు, అలాగే మూడ్‌కు తగిన జోక్స్ వినవచ్చు. ఈ ఆధునిక వెర్షన్ చాలా వేగంగా సమాధానాలు ఇస్తుందని వాట్సప్‌ పేర్కొంది. అదనంగా, మెటా ఏఐ వాయిస్‌ని కూడా మార్చుకునే ఆప్షన్ ఉంది. అక్వాఫినా, క్రిస్టెన్ బెల్, జాన్ సెనా, కీగన్-మైఖేల్ కీ, జూడి డెంచ్ వంటి ప్రసిద్ధ వ్యక్తుల వాయిస్‌ను ఎంచుకోవచ్చు.

వివరాలు 

ఫొటో చాలు 

మీరు వాయిస్‌ కమాండ్‌ ఇవ్వడానికి సమయం లేకపోతే, ఫొటోతో కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, మీకు అర్థం కాని భాషలో ఉన్న పదాలను చూసి, సంబంధిత ఫొటోని పంపించి దాని అర్థం తెలుసుకోవచ్చు. వెంటనే పూర్తి సమాచారం అందించబడుతుంది. ఎడిట్ తాజా అప్‌డేట్‌ల ద్వారా, మెటా సాయంతో ఫొటోలను సులభంగా ఎడిట్‌ చేయవచ్చు. మీ ఇష్టానికి మార్చుకోవడానికి, మీరు పంపిన ఫొటోలోని వస్తువుల రంగులను చిటికెలో మార్చగలదు. అంతేకాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులను తొలగించాలంటే, అది కూడా అతి త్వరలో నిర్వహించగలదు. ఈ ఫీచర్ ప్రస్తుతం రోలవుట్ అవుతోంది . త్వరలోనే అందరికీ అందుబాటులో రానుంది.