WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. లింక్ డివైస్ యాక్టివిటీపై పూర్తి కంట్రోల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. లింక్ చేసిన డివైస్‌లలో జరుగుతున్న యాక్టివిటీని సులభంగా గమనించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో ఇకపై లింక్డ్ డివైసెస్ పేజీని ప్రత్యేకంగా ఓపెన్ చేయకుండా కూడా యూజర్లు తమ ఖాతా సెక్యూరిటీని సులభంగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ప్రస్తుతం " యాక్టివిటీ ఫర్ లింక్డ్ డివైసెస్" అనే పేరుతో ఉన్న ఈ ఫీచర్ ఇంకా బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రాలేదు.
వివరాలు
ఆ చాట్‌లను ఎవరూ చదవలేరు..
ఇక మరో ముఖ్యమైన అప్‌డేట్‌గా, లింక్ చేసిన డివైస్‌ల కోసం చాట్ లాక్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను పాస్‌కోడ్‌తో సురక్షితంగా లాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కంపానియన్ డివైస్‌ల నుంచే ఈ సెక్యూరిటీని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మీ డివైస్ ఎవరి చేతికి వెళ్లినా, మీరు సెట్ చేసిన సీక్రెట్ కోడ్ తెలియకుండా మీ వ్యక్తిగత చాట్‌లను ఎవరూ చదవలేరు.
వివరాలు
అకౌంట్ యాక్టివిటీపై మరింత జాగ్రత్త..
గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్ లింక్ చేసిన డివైస్‌లకు సంబంధించిన అనేక ఫీచర్లను పరిచయం చేస్తోంది. వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడం మరింత సులభమైంది. అయితే ఈ సౌలభ్యం పెరిగిన కొద్దీ, యూజర్లు కూడా తమ ఖాతా భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ డివైస్ యాక్టివ్‌గా ఉందో రియల్‌టైమ్‌లో చూపించే ఫీచర్‌పై కంపెనీ పని చేస్తోంది. దీని వల్ల యూజర్లకు తమ అకౌంట్ యాక్టివిటీపై మరింత స్పష్టత, నియంత్రణ లభిస్తుంది.
వివరాలు
వెంటనే అలర్ట్ వచ్చేస్తుందిలా..
అంతేకాదు, ఒకేసారి పలుచోట్ల నుంచి అకౌంట్ యూజ్ అయితే నోటిఫికేషన్ ఇచ్చే సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఉదాహరణకు, మీరు మీ ప్రైమరీ డివైస్‌లో వాట్సాప్ వాడుతున్న సమయంలో మరో లింక్ చేసిన డివైస్ కూడా యాక్టివ్ అయితే వెంటనే అలర్ట్ వస్తుంది. ఈ ఫీచర్ ద్వారా అనధికార యాక్సెస్‌ను గుర్తించడం సులభమవడంతో పాటు, మీ వ్యక్తిగత చాట్‌లకు అదనపు భద్రత లభిస్తుంది.