
Instagram Edits App :ఇన్‌స్టాగ్రామ్ 'ఎడిట్స్' యాప్ ఆండ్రాయిడ్‌కు వచ్చేసింది..ఇప్పుడు హైక్వాలిటీ వీడియోలు ఇదే యాప్‌లో!
ఈ వార్తాకథనం ఏంటి
ఆండ్రాయిడ్ యూజర్లకు ఒక మంచి వార్త. మెటా, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు తమ ప్రత్యేక వీడియో ఎడిటింగ్ యాప్ 'ఎడిట్స్' ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో iOS యూజర్లకు విడుదలైన ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ 'ఎడిట్స్' యాప్ వీడియో తయారీని మరింత సులభతరం చేస్తుంది.
ఈ యాప్‌లో, కంటెంట్ క్రియేటర్లు ఇకపై ఇతర యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.
అన్ని ఫీచర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్‌లో వెల్లడించిన ప్రకారం ఈరోజుల్లో వీడియో తయారీ ఒక క్లిష్ట ప్రక్రియ. వేర్వేరు యాప్‌లు, వర్క్‌ఫ్లో అవసరం అవుతాయి.
Details
ఎడిట్స్ యాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు
ఫోన్ నుంచే నేరుగా హై క్వాలిటీ వీడియోల తయారీకి వీలు.
ఇతర యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో.
ఐడియాస్ సేవ్ చేసుకునే అవకాశంతో పాటు, ప్రాజెక్ట్‌లను నిర్వహించుకునే సౌలభ్యం.
వాటర్‌మార్క్ లేకుండా వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం.
క్వాలిటీ కెమెరా, ఫ్రేమ్ కచ్చితమైన టైమ్‌లైన్, కటౌట్, AI యానిమేషన్ టూల్స్.
ట్రెండింగ్ రీల్స్ ఫీడ్ నుంచి ఐడియాస్ తీసుకునే ఫీచర్.
Details
రాబోయే అదనపు ఫీచర్లు
కీఫ్రేమ్ ఆధారంగా క్లిప్‌లను యానిమేట్ చేయడంపై టెస్టింగ్.
AI ఆధారిత టూల్ ద్వారా వేగంగా వీడియోల మోడిఫికేషన్.
డ్రాఫ్ట్‌లను స్నేహితులు, బ్రాండ్‌లు, సహకారులతో షేర్ చేసే ఫీచర్.
కొత్త ఫాంట్స్, ట్రాన్సిషన్స్, వాయిస్ ఎఫెక్ట్స్, రాయల్టీ-ఫ్రీ మ్యూజిక్.
ఎడిట్స్ యాప్ ఎలా వాడాలి?
1. మీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి 'Edits by Instagram' ను డౌన్‌లోడ్ చేయండి.
2. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.
3. అంతే, ఇక మీ కంటెంట్ క్రియేషన్ ప్రయాణం మొదలుపెట్టండి!
ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌తో, మీ క్రియేటివిటీకి కొత్త ఆరంభం కావొచ్చు!