LOADING...
xAI: సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం
సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం

xAI: సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌కి చెందిన xAI కంపెనీ సౌదీ అరేబియాలో భారీ స్థాయి AI డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. దేశంలోని సార్వభౌమ సంపద నిధి మద్దతుతో నడుస్తున్న HUMAIN AIతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. సుమారు 500 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే ఈ సెంటర్‌లో NVIDIA కంపెనీకి చెందిన హై-ఎండ్ చిప్స్ వినియోగించనున్నారు. అమెరికా వెలుపల ఇంత పెద్ద డేటా సెంటర్ ఇదే మొదటిదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం మెమ్ఫిస్‌లో ఉన్న xAI 'Colossus 1' (300MW)‌ను ఇది దాటేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలే NVIDIA సీఈఓ జెన్సెన్ హువాంగ్, అమెజాన్ AWS కోసం 100MW డేటా సెంటర్‌ను ప్రకటించారు.

వివరాలు 

ప్రపంచం వినియోగిస్తున్న మొత్తం డేటా సెంటర్ ఎనర్జీకి దాదాపు పది రెట్లు ఎక్కువ

ఇదే సమయంలో అమెరికా-సౌదీ అరేబియా కొత్త AI ఒప్పందం (MoU) చేసుకోవడం కూడా గమనార్హం. ఈ ఒప్పందం ద్వారా సౌదీకి అమెరికా టాప్ టెక్నాలజీకి యాక్సెస్ లభిస్తుండగా,టెక్ భద్రతపై US మరింత నియంత్రణ కలిగి ఉంటుంది. కార్యక్రమంలో మాట్లాడిన మస్క్, రానున్న రోజుల్లో రోబోట్స్,అంతరిక్షంలో ఉండే AI సెంటర్లతో నిండిన భవిష్యత్తు కనిపిస్తోందని చెప్పాడు. అదేకాక, వచ్చే నాలుగైదేళ్లలో సోలార్ పవర్‌తో నడిచే AI శాటిలైట్లు కంప్యూటింగ్‌కు అత్యంత చౌకైన మార్గంగా మారతాయని అంచనా వేశాడు. అయితే ప్రాజెక్ట్ సైజ్ గురించి మాట్లాడేటప్పుడు మస్క్ మొదట పొరపాటున దీన్ని 500 గిగావాట్ల డేటా సెంటర్ అని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచం వినియోగిస్తున్న మొత్తం డేటా సెంటర్ ఎనర్జీకి దాదాపు పది రెట్లు ఎక్కువ!