Page Loader
1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ
1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 10, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగుల తొలగింపులు జరగడంలేదని, బదులుగా కంపెనీ అడ్వర్టైజింగ్ యూనిట్‌లో మార్పులే ఈ తొలగింపులకు కారణమని సీఈవో జిమ్ లాన్జోన్ సృష్టం చేశారు. కంపెనీ తన అడ్వర్టైజింగ్ బిజినెస్‌లో కొంత భాగాన్ని, సప్లై-సైడ్ ప్లాట్‌ఫారమ్ (SSP), దాని స్థానిక అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన జెమినిని మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ప్రకటనల కోసం Taboolaతో తన భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది.

అపోలో

2021లో యాహూని $5 బిలియన్లకు కొనుగోలు చేసిన అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్

యాహూ దాని డిమాండ్ సైడ్ ప్లాటఫారమ్ వ్యాపారాన్ని రెట్టింపు చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రీమియం ఖాతాలకు అమ్మడంపై దృష్టి పెట్టనుంది. దీని కోసం యాహూ స్పోర్ట్స్, యాహూ న్యూస్, యాహూ మెయిల్, యాహూ ఫైనాన్స్ వంటి వాటి కోసం ప్రీమియం యాడ్ సేల్స్ టీమ్‌ను నిర్మించడంలో నిమగ్నమైంది. ఇది యాహూ ప్రాపర్టీలపై యాడ్ ప్లేస్‌మెంట్ల కోసం పోటీపడే ప్రకటనదారుల సంఖ్యను ఎనిమిది రెట్లు పెంచుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ 2021లో యాహూని $5 బిలియన్లకు కొనుగోలు చేసింది. లాన్జోన్ నాయకత్వంలో, కంపెనీ ఇప్పుడు తన ప్రకటన వ్యాపారాన్ని క్రమబద్ధీకరించి మెరుగైన కస్టమర్ విలువను అందించే కొత్త వెంచర్‌పై దృష్టి సారిస్తోంది.