Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక 3 నిమిషాలు రీల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కీలక అప్డేట్!
ఇప్పటివరకు 90 సెకన్లుగా ఉన్న రీల్స్ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.
అయితే, ఈ మార్పు క్రియేటర్స్‌కి ఇబ్బందిగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు 3 నిమిషాలు
రీల్స్ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ ముస్సెరి తెలిపారు.
ఇది ఇప్పటి 90 సెకన్ల నిడివికి దాదాపు డబుల్ టైమ్ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం క్రియేటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
అంతే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్-ఫామ్ వీడియోల ప్రాధాన్యాన్ని కొనసాగిస్తుందని, కానీ క్రియేటర్స్‌కు మరింత స్వేచ్ఛ ఇవ్వడం లక్ష్యమని వివరించారు.
రీల్స్ నిడివి చాలా పరిమితంగా ఉందనే ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఈ మార్పు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
వివరాలు
క్రియేటర్లకు ఇది లాభమా? లేక నష్టమా?
యూజర్ అటెన్షన్ స్పాన్ తగ్గుతూ వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్-ఫామ్ కంటెంట్ నిడివి పెంచడాన్ని పలు ప్లాట్‌ఫారాలు పరిశీలిస్తున్నాయి.
యూట్యూబ్ కూడా తన షార్ట్ వీడియోల నిడివిని 1 నిమిషం నుంచి 3 నిమిషాలకు పెంచుతూ 2024 అక్టోబర్‌లో నిర్ణయం తీసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ గతంలోనే 90 సెకన్ల రీల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాక, లాంగ్-ఫామ్ వీడియోలను ప్రోత్సహించదని చెప్పినా, 10 నిమిషాల నిడివి గల రీల్స్ టెస్టింగ్ చేసింది.
కానీ అవి పెద్దగా అమలు కాలేదు. ప్రస్తుతం రీల్స్ నిడివి 3 నిమిషాలకు పెంచబడింది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరుగుతుందా లేదా అనేది చూడాలి.
వివరాలు
యూజర్ బిహేవియర్‌పై ప్రభావం
రీల్స్ నిడివి పెరగడం క్రియేటర్స్‌కి లాభమా అనేది యూజర్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
పొడవైన రీల్స్ వినియోగదారులు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే రీచ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా, యూజర్లు ఈ పొడవైన రీల్స్‌ను స్వీకరిస్తారా? లేదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ మునుపటి వైఖరి
గతంలో ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ నిడివి గల రీల్స్ వల్ల క్రియేటర్స్‌కి ఇబ్బంది కలగవచ్చని తెలిపింది.
కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, ఫీడ్‌బ్యాక్‌లను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ తాజా అప్డేట్ క్రియేటర్స్‌కి ఎంతవరకు సానుకూలంగా మారుతుందో, యూజర్లు దానికి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.