
TRAI New Rules: ట్రాయ్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం ఎందుకో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత ఓటీపీలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.
బ్యాంకింగ్, ఫుడ్ డెలివరీ, షాపింగ్, తదితర ఆన్‌లైన్ సేవలలో ఓటీపీలు అవసరం అయ్యాయి.
కోరియర్ సేవలు కూడా ఓటీపీ ద్వారా జరుగుతున్నాయి. అయితే, ఓటీపీలు కస్టమర్ల భద్రత కోసం ఉపయోగపడుతున్నప్పటికీ, కొన్నిసార్లు అవి దుర్వినియోగానికి గురవుతున్నాయి, దీని వలన కొంతమంది తమ డబ్బును కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ నేపధ్యంలో భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 1 నుండి నకిలీ కాల్స్, సందేశాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
వివరాలు
SMS సందేశాలు, లింకులు లేదా APK ఫైళ్ళను బ్లాక్ చేయాలని నిర్ణయించిన ట్రాయ్
ఈ నిబంధనలు అమలు అవడం వలన ఓటీపీ సందేశాలు కొంత ఆలస్యంగా అందగలవు.
నకిలీ కాల్స్, సందేశాలపై నియంత్రణ ఏర్పడటం వల్ల, బ్యాంకింగ్ సంబంధిత సందేశాలు, ఓటీపీ లలో ఆలస్యం తప్పదు.
అలా అయినప్పుడు, మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేయలేరు. అలాగే, ఆన్‌లైన్ ఆర్డర్ చేసినప్పుడు, డెలివరీ సమయంలో మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రాకపోతే, ఆ ప్రొడక్ట్ డెలివరీని తీసుకోలేరు.
TRAI, SMS సందేశాలు, లింకులు లేదా APK ఫైళ్ళను బ్లాక్ చేయాలని నిర్ణయించింది.
ఇలాంటి మోసాలను అరికట్టడానికి, హ్యాకర్ల నుండి మీ మొబైల్ సమాచారం, డబ్బును రక్షించుకోవడానికి ఈ చర్యలు తీసుకోవడం అవసరం.
అయితే, ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే వెబ్‌సైట్‌లు, యాప్‌లు తమ సంస్థ పేరు నమోదు చేయడం తప్పనిసరి.
వివరాలు
TRAI టెలికాం సంస్థలకు ఆదేశాలు
లేకపోతే, ఓటీపీ కస్టమర్ ఫోన్‌కు చేరదు. బ్యాంకులు,పేమెంట్ ఆపరేటర్లు,Zomato,Uber వంటి యాప్‌లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఈ సందేశాల్లో URLలు,OTT లింకులు, APKలు లేదా కాల్ బ్యాక్ నంబర్లు ఉంటే, వాటిని బ్లాక్ చేయాలని TRAI టెలికాం సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు, బ్యాంకులు,ఆర్థిక సంస్థలు,ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సందేశాలు,ఓటీపీ టెంప్లేట్లు,కంటెంట్‌ను జియో,ఎయిర్‌టెల్,వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లతో నవంబర్ 31 లోపు నమోదు చేయాలి.
టెలికాం సంస్థలు,ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా TRAI నిబంధనల్ని పాటించకపోతే, ఓటీపీలు నిలిపివేయబడతాయి.
ఈ విధంగా,డిసెంబర్ 1 నుండి వినియోగదారులు ఓటీపీ సందేశాలను ఆలస్యంగా పొందవచ్చు.
అయితే,ఇది వినియోగదారుల భద్రత కోసం తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య అని TRAI స్పష్టం చేసింది.