
YouTube Hype: కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ 'హైప్' ఫీచర్ లాంచ్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్‌లో కొత్తగా ప్రయాణం ప్రారంభించిన వ్యక్తులు తమ వీడియోలు ఎక్కువ మందికి చేరడానికి బాగా కష్టపడుతున్నారు. సబ్‌స్క్రైబర్లు పెంచుకోవడానికి, వ్యూయర్‌షిప్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి క్రియేటర్లను ఉద్దేశించి యూట్యూబ్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. తమ వీడియోలు ఎక్కువ మంది వరకు చేరి, మరిన్ని వ్యూస్ సంపాదించేందుకు 'హైప్' అనే పేరుతో ఈ కొత్త సదుపాయాన్ని భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అన్నదే ఇప్పుడు చూద్దాం.
హైప్ ఫీచర్
హైప్ ఫీచర్ అంటే ఏమిటి?
500 నుంచి 5 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ క్రియేటర్ల కోసం 'హైప్' అనే ప్రత్యేక ఫీచర్‌ను యూట్యూబ్ ప్రారంభించింది. ఈ ఫీచర్‌కు అర్హత సాధించిన ఛానల్ హోమ్‌పేజ్‌లో క్రింద భాగంలో 'హైప్' అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే,ఆ వీడియోకు కొన్ని ప్రత్యేకమైన పాయింట్లు జోడించబడతాయి. దీంతో ఆ వీడియో మరింత మంది ప్రేక్షకులకు చేరుతుంది. ఆ వీడియోకు లభించే హైప్ పాయింట్ల ఆధారంగా టాప్ 100 వీడియోల జాబితాలోకి చేరే అవకాశం ఉంటుంది. యూట్యూబ్‌లోని ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో 'హైప్' పొందిన వీడియోల జాబితా అందుబాటులో ఉంటుంది. తక్కువ సబ్‌స్క్రైబర్లతో ఉన్న ఛానళ్లకు గూడా సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ హైప్ పాయింట్ల రూపంలో బోనస్‌ను అందిస్తుంది.
వివరాలు
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో సభ్యులుగా ఉన్న క్రియేటర్లు మాత్రమే ఈ హైప్ ఫీచర్‌ను ఉపయోగించగలుగుతారు. కనీసం 500సబ్‌స్క్రైబర్లు ఉండటం తప్పనిసరి. గరిష్టంగా 5లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నవారికి మాత్రమే ఈఫీచర్ అందుబాటులో ఉంటుంది. అర్హత కలిగిన ఛానళ్లకు ఏదైనా ప్రత్యేక సెటప్ లేకుండానే 'హైప్'బటన్ ఆటోమేటిక్‌గా కనిపించగలదు. అయితే,హైప్ పొందాలంటే ఆ వీడియోను అప్‌లోడ్ చేసిన 7రోజుల్లోగా ఉండాలి. వీడియోలను వీక్షించే ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన వీడియోలకు హైప్ ఇవ్వొచ్చు. లైక్,షేర్ వంటి బటన్ల దగ్గరే హైప్ బటన్ చూపిస్తుంది.ఒక వీక్షకుడు ఒక్క వారంలో మూడుసార్లు హైప్ ఇవ్వొచ్చు. వ్యూయర్‌లు ఇచ్చిన హైప్ ద్వారా ఆ వీడియో లీడర్‌బోర్డులో పైకి వెళ్తుంది.ఇది యూట్యూబ్ సిఫార్సులలో కూడా ఆ వీడియోను చూపించేలా సహాయపడుతుంది.