
జెబ్రానిక్స్ కొత్త ఇయర్ బడ్స్ సూపర్బ్.. ఏఎన్‌సీ ఫీచర్‌తో లుక్స్ అదుర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
జెబ్రానిక్స్ కంపెనీ కొత్తగా జెబ్ పోడ్స్-1 ఇయర్‌బడ్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఏఎన్‌సీ ఫీచర్ తో ఈ బడ్స్ రావడం విశేషం. ఇంట్రడక్టరీ ధరతో ఈ బడ్స్ సేల్ కు కూడా వచ్చాయి.
యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ తో బెజ్రానిక్స్ కంపెనీ నుంచి వచ్చి తొలి ఇయర్ బడ్స్ ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 వెర్సన్ తో వచ్చింది. అదే విధంగా కాల్స్ కోసం ఈఎస్‌సీ సదుపాయం ఉంది.
పరిసరాల్లోని బ్యాక్ గ్రౌండ్ శబ్దాలను ఇది క్యాన్సల్ చేయనుంది. గూగుల్అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్ ను కూడా ఇది సపోర్టు చేస్తుంది. గేమింగ్ మోడ్లో సౌంగ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
Details
22 గంటల పాటు బ్యాటరీ లైఫ్
టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేసుకొని అవకాశం ఉంది.
దీని ప్రారంభ ధర రూ.1499 గా నిర్ణయించారు. ముఖ్యంగా బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే దాదాపుగా రూ.250 తగ్గనుంది.
బ్యాటరీ లైఫ్ ANC లేకుండా 28 గంటలు, ANC తో 22 గంటల వరకు ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. అయితే ఏఎన్‌సీ ఎనేబుల్ చేసుకొని వాడితే 22 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
బ్లాక్ కలర్ ఆప్షన్ లో ఈ బడ్స్ లభించనున్నాయి. ఇంట్రడక్టరీ ఆఫర ధర కొంతకాలమే ఉండనుంది.