Page Loader
WTC Points Table: అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్
అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్

WTC Points Table: అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి చెందింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గత సీజన్లలో వరుసగా రెండు సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన టీమిండియా, ఈ సారి అగ్రస్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. ఈ ఓటమితో భారత పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి తగ్గిపోయింది. మరోవైపు, ఆస్ట్రేలియా పీసీటీ 60.71కి పెరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా 59.26 పీసీటీతో రెండవ స్థానంలో నిలవగా, 50 పీసీటీతో శ్రీలంక నాలుగవ స్థానంలో ఉంది.

Details

మిగిలిన టెస్టుల్లో గెలవాలి

ప్రస్తుత స్థితిలో భారత్‌కు మూడు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటినీ గెలిచితే పాయింట్ల శాతం 64.03కి చేరుకుని ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాకు భారత్‌తో మూడు, శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా మిగిలిన టెస్టులన్నింటిలో విజయం సాధిస్తే, 69 పీసీటీతో రెండవ స్థానంలో నిలుస్తుంది. భారత్ ఫైనల్ రేసులో కొనసాగాలంటే, స్వదేశంలో మిగిలిన టెస్టుల్లో విజయం సాధించడం తప్పనిసరి. దక్షిణాఫ్రికా, శ్రీలంక విజయాలు భారత్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉంది.