Olympics: 1904 ఒలింపిక్స్ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో సెయింట్ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.
ఈ వివరాలను వేలం సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ పతకంపై ఒకవైపు 'ఒలింపియాడ్, 1904' అనే అక్షరాలు ఉండగా, విజేత అథ్లెట్ పూల దండ పట్టుకుని ఉన్న బొమ్మను చిత్రించారు.
మరోవైపు పురాతన గ్రీకు పురాణాల్లోని విజయ దేవత నైక్‌తో పాటు దేవతల రాజు జ్యూస్ బొమ్మ కూడా ఉంది.
ఈ పతకాన్ని 110 మీటర్ల హర్డిల్స్ పోటీలో విజేతగా నిలిచిన అమెరికన్ క్రీడాకారుడు ఫ్రెడ్ షుల్‌కు ప్రదానం చేశారు.
Details
రిబ్బన్, లెదర్ బాక్స్ వేలంలో ప్రదర్శన
పతకంతో పాటు అప్పట్లో అందించిన రిబ్బన్, లెదర్ బాక్స్ కూడా వేలంలో ప్రదర్శనకు ఉంచారు.
వీటితో పాటు మరికొన్ని స్మారక వస్తువులు కూడా వేలం వేశారు. 1904 సెయింట్ లూయి ఒలింపిక్స్‌లోనే తొలిసారి విజేతలకు నిజమైన బంగారు పతకాలు అందజేశారు.
ఆ క్రీడల్లో మొత్తం 96 బంగారు పతకాలలో 78 పతకాలు అమెరికన్లు గెలుచుకున్నారు. ఇక ఇతర ఒలింపిక్స్‌లో గెలుచుకున్న పతకాలు కూడా ఈ వేలంలో భాగమయ్యాయి.
1932 లాస్ ఏంజెలెస్, 1964 టోక్యో, 1998 నగానో, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో గెలిచిన స్వర్ణ పతకాలను వేలం వేశారు.
ఇదే వేలంలో 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో జర్మన్ లాంగ్‌జంపర్ లజ్ లాంగ్ గెలిచిన రజత పతకం రూ.4.2 కోట్లు (4,88,000 డాలర్లు) పలికింది.