NZ Vs BAN: న్యూజిలాండ్‌పై చారిత్రాత్మక విజయం దిశగా బంగ్లాదేశ్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులతో రెచ్చిపోయిన బంగ్లా, రెండో ఇన్నింగ్స్ లోనూ 338 పరుగులతో చెలరేగిపోయింది. కెప్టెన్ నజ్ముల్ హోసెన్ శాంతో (193 బంతుల్లో 104 నాటౌట్, 10 ఫోర్లు) శతకం సాధించడంతో బంగ్లా భారీ పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగులు చేసిన న్యూజిలాండ్, రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం బంగ్లా 219 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక బంగ్లా విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో ఉంది.
రెండు ఇన్నింగ్స్ లో కలిపి 8 వికెట్లు తీసిన తైజుల్ ఇస్లామ్
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో లాథమ్(0), కేన్ విలియమ్సన్(11), హెన్రీ నికోల్స్ (2), టామ్ బ్లండెల్ (6) నిరాశపరిచాడు. ఇక క్రీజులో డారిన్ మిచెల్ (44*), సోది (7*) ఉన్నారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్, మళ్లీ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.